తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్ల విషాదం! | - | Sakshi
Sakshi News home page

తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్ల విషాదం!

Published Sat, Dec 30 2023 1:24 AM | Last Updated on Sat, Dec 30 2023 9:19 AM

- - Sakshi

పవన్‌, శ్రీకాంత్‌ (ఫైల్‌)

వ‌రంగ‌ల్‌, మహబూబాబాద్‌: తాత సంవత్సరీకానికి వచ్చిన ఇ ద్దరు మనుమళ్లు వాగులో స్నానానికి వెళ్లి ప్ర మాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రా మంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల రాజీరు ఏడాది క్రితం చనిపోయాడు. శుక్రవారం సంవత్సరీకం (ఏడాది మాశికం). దీంతో అతని మనుమళ్లు తాటిపాముల పవన్‌(25), సిరిమల్లె శ్రీకాంత్‌ (17) (బావబామ్మర్దులు)లు వేములపల్లికి వచ్చారు. గ్రామంలోని పెద్దవాగులో స్నానానికి ఇద్దరు వెళ్లారు.

వాగులో భారీ గుంతలు ఉండడం.. లోతు తెలియక దిగిన వారు ఈత రాకపోవడంతో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. చిట్యాల సీఐ వేణు చందర్‌, ఎస్సై జాడి శ్రీధర్‌ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్లు వాగులో పడి చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌ తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: అన్నీ సంచలనాలే.. ‘టీఎస్‌పీఎస్సీ’ కేసుతో కరీంనగర్‌కు లింకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement