Ranjit
-
జర్నలిస్ట్‌పై దాడి.. రంజిత్‌కు మోహన్‌బాబు పరామర్శ
జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు. కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్ని కలిసి పరామర్శించాడు. -
అమ్మానాన్న.. నన్ను క్షమించండి..!
చెన్నారావుపేట: అమ్మా, నాన్నా నన్ను క్షమించండి.. మీ ఆశలు నెరవేర్చలేకపోతున్నాను.. అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటనకు సంబంధించి, స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన చీర మల్లేశం– కళావతిలకు కుమార్తె, కుమారుడు రంజిత్(25) ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిపించారు. కుమారుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసి ఉన్నత చదువులు చదువుతూ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఓ పోటీ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఉద్యోగం రాలేదని మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో స్నేహితుడు ప్రశాంత్ అక్క వివాహానికి మూడు రోజుల క్రితం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. పట్టణంలోని ఎర్రముక్కలపల్లి రోడ్డు వద్ద ఓ ప్రముఖ లాడ్జీని అద్దెకు తీసుకున్నారు. గురువారం తన స్నేహితులు టిఫిన్ చేయడానికి వెళ్లారు. రంజిత్ రాకపోవడంతో స్నేహితులు గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు తెలియజేసి, రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంజిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం రంజిత్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చేతికొచ్చిన కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురి కంటతడి పెట్టించింది. -
మహాకూటమి అభ్యర్థుల నామినేషన్లు
సోలాపూర్: మహాకూటమి అభ్యర్థులు రామ్ సాత్ పూతే, రంజిత్ సింహ నింబాల్కర్ మంగళవారం సోలాపూర్, మాడా లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లకు ముందుగా ధర్మవీర్ చత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్‌కు ఇరువురు అభ్యర్ధులు ఘన నివాళులర్పించారు. అనంతరం ఛత్రపతి శ్రీ శంభాజీ మహారాజ్ చౌక్ నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలిరాగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో సోలాపూర్ అభ్యర్థిగా రామ్ సాత్ పూతే మాడా అభ్యరి్థగా రంజిత్ సింహ నింబాల్కర్ సోలాపూర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల నిర్వహణాధికారి కుమార్ ఆశీర్వాద్‌కు నామినేషన్లను సమర్పించారు. ఈ ర్యాలీలో ఎంపీ జై సిద్దేశ్వర స్వామి, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, సచిన్ కళ్యాణ్ శెట్టి, సుభాష్ దేశముఖ్, యశ్వంత్ మానే, సమాధాన్ అవతాడే, భవన్ రావు షిండే, సంజయ్ షిండే, జై కుమార్ గోరే, షాహాజీ పాటిల్, మాజీ మంత్రి లక్ష్మణరావు డోబలే, మాజీ ఎమ్మెల్యే రాజన్ పాటిల్, ప్రశాంత్ పరిచారక్, దీపక్ బాబా సాలోంకే, కిషోర్ దేశ్ పాండే, విక్రం దేశముఖ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర కాలే, జిల్లా అధ్యక్షుడు చేతన సింహ కేదార్, షాజీపవార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, శివసేనలతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల ఆఫీస్ బేరర్లు, ప్రతినిధులు, కార్యకర్తలు తమ పార్టీల జెండాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. నాయకులందరూ ప్రత్యేక ప్రచార రథంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలగా వేలాది మంది కార్యకర్తలు నినాదాలు చేస్తూ వారిని అనుసరించారు. ర్యాలీ చత్రపతి శ్రీ శంభాజీ మహరాజ్ చౌక్ నుంచి ప్రారంభమై చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్, మెకానిక్ చౌక్, సరస్వతి చౌక్, చారు హుతాత్మ పూతల చౌక్‌కు చేరుకున్న అనంతరం శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అలాగే అక్కడ ఉన్న నలుగురు అమర వీరుల విగ్రహాలకు, అహల్యా దేవి హోల్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు నాయకులంతా అంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రసంగిస్తూ ...ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా మార్గదర్శనం చేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి వల్ల బీజేపీ ఈ రెండు స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ధైర్య శీల మోహితే పాటిల్ కూడా... మరోవైపు మాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ పవార్ పార్టీ తరపున ధైర్య శీల మోహితే పాటిల్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మాడా నియోజకవర్గం ఎన్నికల అధికారి మోనికా సింహ ఠాకూర్‌కు నామినేషన్‌ను సమర్పించారు. పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీకి రాజీనామా చేసి ఎన్సీపీ పవార్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి విజయ్ సింహ మోహితే పాటిల్ డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధైర్యశీల్ మోహితే పాటిల్ సతీమణి శీతల్ దేవి, సోదరుడు జయసింహ మోహితే పాటిల్ , మాజీ ఎమ్మెల్యే నారాయణ పాటిల్, పవార్ ఎన్సీపీ జిల్లా అధ్యక్షుడు బలిరాం కాకాసాటే, సురేష్ అసాపురే, శివసేనకు చెందిన అనిల్ కోకిల్ తదితరులు పాల్గొన్నారు. -
‘లెహరాయి’ నుంచి ‘అప్సరస.. అప్సరస’సాంగ్ రిలీజ్
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లెహరాయి’. రామకృష్ణ పరమహంస ని దర్శకుడి గా పరిచయం చేస్తూ బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో మద్దిరెడ్డి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్సరస అప్సరస’ అనే మరో సాంగ్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. గేయ రచయిత శ్రీమణి రచించిన ఈ పాటని రేవంత్ ఆలపించారు.‘తీపితో తేల్చి చెప్పా.. తొలితీపి నీ పలుకని .. తారనే పిలిచి చూపా ..తొలి తారా నీ నవ్వని’లాంటి లైన్స్ మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్లు, మంచి ఫీల్ ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు రామకృష్ణ పరమహంస’ తెలిపారు. ఈ చిత్రంలో ధర్మపురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్, అలీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఏప్రిల్ 28న ఏం జరిగింది?
రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏప్రిల్ 28న ఏం జరిగింది’. వీరాస్వామి.జి. స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరాస్వామి జి. మాట్లాడుతూ– ‘‘ఏప్రిల్ 28న ఏం జరిగింది?’ అనే డిఫరెంట్ టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది మా చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది. నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో, ట్విస్టులతో రూపొందింది. ప్రతి మలుపు ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. థ్రిల్లర్ జోనర్లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు సినిమా రాలేదు’’ అన్నారు. తనికెళ్ల భరణి, అజయ్, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్. -
మావోయిస్టు నంబర్–2గా రంజిత్ బోస్
న్యూఢిల్లీ: సీపీఐ(మావోయిస్టు) పార్టీ అగ్రనాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పార్టీ రెండో స్థానంలోకి బెంగాల్‌లోని హౌరా ప్రాంతానికి చెందిన రంజిత్ బోస్(63) అలియాస్ కబీర్‌ను ఎంపిక చేసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రంతోపాటు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేయడంలో ఈయన దిట్ట. రంజిత్ తలపై బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలు ప్రకటించిన రివార్డు మొత్తం రూ.కోటి వరకు ఉంది. బిహార్, జార్ఖండ్‌లతోపాటు తూర్పు భారతంలో పార్టీ పట్టు పెంచడం, సంచలన ఘటనలకు కార్యరూపం ఇచ్చేందుకే పార్టీ ఈ మార్పు చేపట్టిందని భావిస్తున్నారు. పార్టీలో రెండో స్థానంలో ఉన్న బెంగాల్‌లోని మిడ్నపూర్‌కు చెందిన ప్రశాంత్ బోస్(74)స్థానంలో రంజిత్ నియమితులయ్యారు. అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ సహా కీలక నేతలంతా ఇటీవల పశ్చిమబెంగాల్ అడవుల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగం పొలిట్‌బ్యూరోలో ప్రస్తుతం నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, రంజిత్ బోస్, మాజీ అధిపతి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మిసిర్ బిస్రా అలియాస్ సాగర్ ఉన్నారు. బెంగాల్లో 2007లో నందిగ్రామ్‌లో నానో కార్ల ఫ్యాక్టరీని స్థాపించడంతో నాడు జరిగిన వ్యతిరేకోద్యమాన్ని రంజిత్ వెనక ఉండి నడిపించారు. దీంతోపాటు 44 గ్రామాలతో కూడిన లాల్‌గఢ్‌ను విముక్త ప్రాంతంగా ప్రకటించిన వ్యక్తిగా రంజిత్ బోస్‌కు పేరుంది. (చదవండి: షహీన్‌బాగ్ షూటర్ ఆప్ సభ్యుడే) -
రాహుల్ గాంధీని పబ్లిక్‌లో కొట్టాలి..
ముంబై: హిందూత్వ యోధుడు వీడీ సావర్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రజల మధ్య నిల్చోబెట్టి కొట్టాలని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఎవరైనా సావర్కర్‌ను అవమానిస్తే పబ్లిక్‌లో కొట్టాలని గతంలో ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చిన విషయాన్ని రంజిత్ గుర్తు చేశారు. రంజిత్ సావర్కర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘మా తాత బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పారని రాహుల్ పదేపదే అంటున్నారు. అది నిజం కాదు. జైలు నుంచి విడుదల అయ్యేందుకు బ్రిటిష్ వారు పెట్టిన నిబంధనలకు ఆయన అంగీకరించారు. అంతేకానీ క్షమాపణ చెప్పలేదు’ అని వివరణ ఇచ్చారు. ‘పౌరసత్వం’ సావర్కర్‌కు భిన్నం: శివసేన బీజేపీ తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం హిందూవాద నాయకుడైన వీర్ సావర్కర్ ఆలోచనలకు భిన్నమైనదని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహిళలకు రక్షణ లేకపోవడం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలను కప్పిపుచ్చేందుకు బీజేపీ ‘పౌరసత్వ’ వాదనను తెరపైకి తెచ్చిందని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఒకే దేశం ఉండాలని సావర్కర్ ఆకాంక్షించారని, ఇప్పుడు ఆయన ఆలోచనలకు తూట్లు పొడిచేలా ఇతర దేశాల మైనారిటీలను భారత్‌లోకి బీజేపీ ఆహ్వాని స్తోందని అన్నారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) -
ఒకే చిత్రానికి ముగ్గురి మెగాఫోన్లు
సాధారణంగా ఒక చిత్రాన్ని ఒక్కరే దర్శకత్వం వహిస్తుంటారు. అరుదుగా దర్శక ద్వయం కలిసి చిత్రం చేస్తుంటారు. అలాంటిది ఒకే చిత్రానికి ముగ్గురు దర్శకులు పనిచేస్తే కచ్చితంగా అది వైవిధ్యభరిత కథా చిత్రమే అవుతుంది. అదీ ఈ తరం ఆశా దర్శకులైన పా.రంజిత్, పసంగ పాండిరాజ్, సుశీంద్రన్ ముగ్గురు యువ దర్శకులు కలిస్తే ఆ చిత్రం ఒక కొత్త ప్రయోగమే అవుతుంది. అలాంటి వినూత్న ప్రయోగానికి ఈ దర్శక త్రయం సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ చిత్రం మూడు కథలతో కూడి ఉంటుందట. ఒక్కో కథకు ఒక్కో దర్శకుడు మెగాఫోన్ పట్టనున్నట్లు టాక్. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అధికారిక పూర్వంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులు వారివారి తాజా చిత్రాల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈ ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతారని భావించవచ్చు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని దర్శకుడు పాండిరాజ్ తన పసంగ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
రక్తహీనతతో చిన్నారి మృతి
కెరమెరి(ఆదిలాబాద్) రక్త హీనతతో బాధపడుతున్న ఓ చిన్నారి చికిత్స పొందుతూ చనిపోయింది. వివరాలివీ.. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం దువుడుపల్లి గ్రామానికి చెందిన రంజిత్, వాణి దంపతుల కుమార్తె సహస్ర(ఏడాది) రక్త హీనతతో బాధపడుతోంది. ఆమెను తల్లి దండ్రులు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె 12 రోజులుగా చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించటంతో సహస్ర గురువారం ఉదయం చనిపోయింది. చిన్నారి సికిల్‌సెల్ అనీమియాతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబసభ్యులు చెప్పారు. -
ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్లో ఒక హిస్టారికల్ చిత్ర రూపకల్పనకు కోలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రం, బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి-2 చిత్రాలు బడ్జె ట్ విషయంలో నువ్వా నేనా అన్నంతగా పో టీపడుతున్నాయి. విశేషం ఏమిటం టే ఈ రెండు చిత్రాలు వచ్చే ఎడాది ఇం చు మించు ఒకే సమయంలో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయన్నది గమనార్హం. ఈ విషయాన్ని అటుంచితే వీటికి మించిన వ్యయంతో ఒక త్రిభాషా చిత్రం తెరకెక్కడానికి రెడీ అవుతోంద న్న ప్రచారం ఇప్పటికే కోలీవుడ్టో హల్చల్ చేస్తోంది. ఆ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తమ 100వ చిత్రంగా రూపొందించనుందని, ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 350 కోట్ల బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. అంతే కాదు హిస్టారికల్ కథతో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు సుందర్.సీ హ్యాండిల్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గానీ, కోలీవుడ్ టాప్ హీరో సూర్య గానీ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. నిర్ణయం కాని అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రస్తుతం ఎస్-3 చిత్రంలో నటిస్తున్న తాను తదుపరి రంజిత్ (కపాలి చిత్రం ఫేమ్)దర్శకత్వంలో నటించనున్నానని స్పష్టం చేశారు. తాజాగా ఈ అత్యంత భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇదే నిజం అయితే విజయ్, సుందర్.సిల తొలి కాంబినేషన్లో రానున్న చిత్రం కచ్చితంగా సంచలనమే అవుతుంది. -
వీఆర్ఏ అనుమానాస్పద మృతి
వరంగల్ జిల్లా కేసముద్రంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనకు పోలీసులే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. బెజ్జం రంజిత్(28) వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. అతడు సోమవారం స్నేహితులతో కలిసి గుంజేడులో జరిగే జాతరకు వెళ్లాడు. సాయంత్రం అంతా కలసి తిరుగు పయనమయ్యారు. ఆ క్రమంలో వారిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగించారు. అయితే, మద్యం మత్తులో ఉన్న రంజిత్ పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిని నర్సంపేట ఆస్పత్రికి తీసుకె ళ్లి ఆల్కహాల్ పరీక్ష చేయించబోగా అతడు వాదులాటకు దిగాడు. ఈ క్రమంలోనే ముక్కు నుంచి రక్తస్రావం కావటంతో తీవ్ర అస్వస్థతకు గురై అర్థరాత్రి చనిపోయాడు.ఈ సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులే అతడిని కొట్టి చంపారని ఆరోపిస్తూ రాస్తారోకో చేసేందుకు ప్రయ్నతించారు. -
ఇది రొటీన్ కథనం కాదు!
గతంలో ‘థియేటర్లో’ అనే సినిమా నిర్మించిన సాయి కిరణ్ ముక్కామల దర్శకునిగా మారారు. మాంత్రిక్స్ మీడియా పతాకంపై రంజిత్, అర్చన జంటగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కథనం’. సాబు వర్గీస్ స్వరపరచిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. మోషన్ పోస్టర్‌ను రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు, టీజర్‌ను సీనియర్ దర్శకులు ఎ.కోదండరామి రెడ్డి, బిగ్ సీడీని డెరైక్టర్ పూరీ జగన్నాథ్, పాటల సీడీని నటుడు తనికెళ్ల భరణి విడుదల చేశారు. ‘‘ప్రతి మనిషికీ ఓ కథ, కథనం ఉంటుంది. ఈ చిత్రంలో కథ రొటీన్‌గా ఉండదు. కథనం ఏంటో తెరపైనే చూడాలి’’ అన్నారు దర్శక-నిర్మాత. ‘‘పోస్టర్స్, ప్రోమో, టైటిల్, ట్యాగ్ లైన్ బాగున్నాయి. ప్రతి మనిషికీ బిగ్గెస్ట్ పెయిన్ ప్రకృతి నుంచే వస్తుంది. దేవుడు అందరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడు’’ అని పూరీ జగన్నాథ్ అన్నారు. రంజిత్, అర్చన తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ఐ.సునీల్ కుమార్. -
రాజమౌళి రజనీకాంత్‌తో చిత్రం చేస్తే..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డెరైక్ట్ చేయాలని ఆశ ఏ దర్శకుడికి మాత్రం ఉండదు. అలాంటి అవకాశం కోసం చాలామంది ఇప్పటికీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం రజనీకాంత్ ఏకకాలంలో రెండు భారీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో వహిస్తున్న కబాలి. ఇందులో సూపర్‌స్టార్ యంగ్ అండ్ ఓల్డ్ గెటప్‌లలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రెండవది 20వో ఎందిరన్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఇక ఇటీవలే చిత్ర నిర్మాణం ప్రారంభించుకున్న ఈ చిత్రంపై అంచనాలకు హద్దులే లేవన్నట్లుగా పరిస్థితి నెలకొంది. కాగా ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్యల్ని ప్రముఖదర్శకుడు, వెండి తెరపై వండర్స్‌ను క్రియేట్ చేస్తున్న రాజమౌళి చేశారు. బాహుబలి చిత్రంతో హాలీవుడ్ దృష్టిని తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్లో బదులిచ్చారు. రజనీకాంత్ మీరు దర్శకత్వం చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సూపర్‌స్టార్‌కు తానెలాంటి పాత్రను ఇస్తానో తెలియదు గాని ఆయనతో చిత్రం చేస్తే ఆ చిత్రంలోని మాటలు థియేటర్లలో 10 రోజుల వరకు ప్రేక్షకులకు వినిపించవన్నారు. అంతగా ప్రేక్షకుల క రతాళధ్వనులు, కేరింతలతో థియేటర్లు మారుమ్రోగిపోతాయని బదులిచ్చారు. ఏఆర్రెహ్మాన్ మీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉందా అన్న మరో ప్రశ్నకు మన దేశంలో ప్రఖ్యాత కళాకారులెందరో ఉన్నారు. వారందరికీ ఒక్కో వర్కింగ్ స్టైల్ ఉంటుంది. అలా ఏఆర్ రెహ్మాన్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఎక్కువగా రాత్రి వేళల్లో పని చేస్తుంటారు. నేను వేకువ జామున 4, 4.30 గంటలకు నిద్ర లేస్తాను. ఉదయం 7-8 గంటల ప్రాంతంలో నా మెదడు సూపర్గాా వర్కు చేస్తుంది. ఆ సమయంలో ఏఆర్ రెహ్మాన్ నిద్రలో ఉంటారు. కాబట్టి మా కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో తెలియద ని రాజమౌళి జోవియల్‌గా అన్నారు. -
కబాలిలో పాత రజనీ
-
కబాలిలో పాత రజనీ
ప్రస్తుతం సినీ వర్గాల చర్చ అంతా సూపర్ స్టార్ తాజా చిత్రం గురించే... ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్ర ఏమిటీ? ఆయన గెటప్ ఎలా ఉంటుంది? సినిమా వాళ్లు ఏ నలుగురు కలిసినా ఇలాంటి అంశాల గురించే చర్చ. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కలైపులి ఎస్ థాను నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కబాలి అనే పేరును ఖరారు చేసిన విషయం విదితమే. రాధిక ఆప్టే కథానాయికగా నటించనున్న ఈ ప్రిస్టేజియస్ చిత్రంలో నటించడానికి, రజనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అత్య్రంత ఆసక్తిగా ఎదురు చూస్తునట్లు ఈ ఉత్తరాది భామ పేర్కొంది. ఇటీవల దర్శకుడు రంజిత్ రజనీకాంత్‌ను కలిశారు. అప్పుడు రజనీ ‘ప్రేక్షకుల ఆశీస్సులతో, అభిమానుల ప్రేమాభిమానాలతోనే నేను ఇంకా నటిస్తున్నాను. ఈ చిత్రాన్ని మీ ఇష్టప్రకారం తెరకెక్కించండి. ఇతర నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని మీరే ఎంపిక చేయండి. చిత్రంలో కథా పాత్రల్ని మీకు నచ్చిన విధంగా రూపొందించండి’ అంటూ దర్శకుడు రంజిత్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారట. దీంతో కబాలి చిత్రంలో రజనీకాంత్‌ను చాలా కొత్తగా, యువకుడిగా చూపించడానికి దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారని సమాచారం. 1980 ప్రాంతంలో నటించిన ధర్మదొరై చిత్రంలో రజనీ ఎలా ఉన్నారో అంత ఫ్రెష్‌గా కబాలి చిత్రంలో చూపించడానికి ప్రఖ్యాత మేకప్ నిపుణులను రప్పిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నారు. చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 17న ప్రారంభం కానుంది. -
సూపర్‌స్టార్‌తో నయన
సూపర్‌స్టార్ తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. మొదట శంకర్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే లారెన్స్ పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అంతలోనే రంజిత్ ఆశలకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గండికొట్టారని కారణం మెడ్రాస్ చిత్రం తరువాత సూర్య హీరోగా చేస్తానని దర్శకుడు తమ సంస్థతో కమిట్ అయ్యారని నిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఆయన కాస్త పట్టు విడిచి దర్శకుడు రంజిత్‌కు పచ్చజెండా ఊపడంతో ఆయన సూపర్‌స్టార్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో అమితాబ్‌బచ్చన్ తరహాలో రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో నటించనున్నారని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదన్నది తాజా సమాచారం. ఇప్పుడీ చిత్రాన్ని విజయ్ హీరోగా ఇంతకుముందు కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ ఈరోస్ ఎంటర్టైన్ సంస్థ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఈమె ఇంతకుముందు సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. శివాజీ చిత్రంలో రజనీతో సింగిల్ సాంగ్‌కు ఆడారు. -
ఆదుకుంటే పోలెండ్‌కు...
దాతల కోసం ఎదురుచూస్తున్న విలువిద్య క్రీడాకారులు పట్టించుకోని కేయూ,డిగ్రీ కళాశాల యాజమాన్యం జూలై 1నుంచే పోలెండ్లోచాంపియన్షిప్ పోటీలు ఈనెల 30లోపు వెళ్లకుంటే అంతే.. ఐదు రోజులే గడువు క్రీడాభిమానులూ.. స్పందించండి విలువిద్యలో దేశఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఇద్దరు యువ క్రీడాకారులకు పేదరికం శాపంగా మారింది. జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో అసమాన ప్రతిభతో కీర్తిపతాకం ఎగురవేసిన వారికి ఇప్పుడు అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ఆర్థిక పరిస్థితి వెనక్కి గుంజుతోంది. విలువిద్యలో ఆరితేరిన పర్వతగిరి మండలంలోని కల్లెడకు చెందిన ఎం.రంజిత్‌కుమార్, రావూరుకు చెందిన లావణ్యకు జూలై 1 నుంచి పోలెండ్‌లో జరిగే వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా వెళ్లిరావడానికి డబ్బులు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 30వ తేదీలోపు దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. - పర్వతగిరి నిరుపేద కుటుంబానికి చెందిన రంజిత్‌కుమార్, లావణ్యలు ఇప్పుడు దాతల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. విలువిద్యలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న వీరు నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు. జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన ఈ క్రీడాకుసుమాలకు దేశ కీర్తి పతాకను అంతర్జాతీయస్థాయిలో రెపరెపలాడించే అవకాశం వచ్చినా పేదరికం అడుగడుగునా అడ్డుతగులుతోంది. శిక్షణ ఇచ్చినవారు మా వల్ల కాదు పొమ్మంటే.. ప్రభుత్వం పట్టనట్టు ఊరుకుంది. ఫలితంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 8వరకు పోలెండ్ దేశంలో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్ షిప్ పోటీలకు ఎక్కడ దూరమైపోతామో అని బెంగపెట్టుకుంటున్నారు. మండలంలోని కల్లెడకు చెందిన ముద్దరబోయి న రంజిత్‌కుమార్, రావూరు గ్రామానికి చెందిన నో ముల లావణ్య ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. రం జిత్కుమార్ జార్ఖండ్ రాష్ట్రంలోని టాటా అకాడమీ లో, లావణ్య సెయిల్ అకాడమీలో ఆర్చరీలో శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామంలోని ఆర్డీఎఫ్ పాఠశాల లో వీరు 8వ తరగతి చదువుతున్న సమయంలో వి లువిద్యలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. క్రమంగా అందులో ప్రతిభ కనబర్చి పలు పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నారు. పంజాబ్ రాష్ట్రం లోని పాటియాలాలో గతనెలలో నిర్వహించిన ఆ లిండియా యూనివర్సిటీ గేమ్స్ క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపిక చేసిన 12మందిలో వీరు మూడు, నాలు గు ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. ఈ నెలలో జరిగిన టీం సెలక్షన్స్‌లోనూ మూడో ర్యాంకు సాధించి ప్రతిభకు కొదవలేదని నిరూపించారు. ఇద్దరివీ పేదకుటుంబాలే.. రంజిత్‌కుమార్, లావణ్య.. ఇద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. రంజిత్‌కు ఓ అన్న, అక్కయ్య ఉన్నారు. రంజిత్ చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి సోమయ్య గుండెజబ్బుతో మరణించాడు. తల్లి సత్తెమ్మ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ఇక లావణ్య తల్లిదండ్రులు వెంకటమ్మ, ఐలమ్మలు కడు నిరుపేదలు. తండ్రి రావూరు గ్రామ పంచాయతీ కారోబార్‌గా పనిచేస్తుండగా తల్లి దినసరి కూలీ. రూ.1.30లక్షలు ఉంటేనే.. అద్భుత ప్రతిభతో విజయాలు సాధిస్తూ వస్తున్న రంజిత్, లావణ్యలు ఇద్దరికీ వచ్చే నెలలో పోలెం డ్లో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే అక్కడికి వెళ్లి వచ్చేందుకు పెద్దమొత్తంలో డబ్బులు అవసరం కావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఒక్కొక్కరికి దాదాపు రూ.1.30వేలు ఖర్చు అవుతుంది. ఇందుకోసం సంబంధిత కాకతీయ యూనివర్సిటీ రూ.లక్షా పదివేలు, క్రీడాకారులు చదువుకుంటున్న తొర్రూరులోని సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం రూ.20వేలు ఇవ్వాల్సి ఉండగా ఎవరూ స్పందించకపోవడంతో వారి భవిత ప్రశ్నార్థకమైంది. దీనికితోడు ప్రభుత్వ సాయం కూడా కరువవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక శిక్షణ ఇస్తున్న సంస్థలు మా బాధ్యత శిక్షణ వరకే అని తప్పించుకోజూస్తున్నాయి. ఈనెల 30వ తేదీలోపు వెళ్లకుంటే పోటీల్లో పాల్గొనే అర్హత కోల్పోతామని, క్రీడాప్రేమికులు పెద్దమనుసుతో తమను ఆదుకుంటే పోటీల్లో పాల్గొని జిల్లాకు, దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారీ క్రీడా కుసుమాలు. కేయూనే భరించాలి విలువిద్య క్రీడాకారుల ఖర్చులు కాకతీయ యూనివర్సిటీనే భరించాలి. కేయూ పరిధిలో చదువుతున్నందున వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదే. యూనివర్సిటీ పేరును నిలబెట్టేది వారే కాబట్టి విద్యార్థుల ఖర్చులు వారే భరించాల్సి ఉంటుంది. - రాచకొం అశోకాచారి, ప్రిన్సిపాల్ , ఆర్డీఎఫ్ క్రీడారంగంలోకి వచ్చి తప్పుచేశా ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటుందని ముందే తెలిస్తే ఈ రంగంలోకి వచ్చేవాడినే కాదు. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు మన దేశం నుంచి 12 మంది సెలెక్ట్ కాగా ఒకే ప్రాంతానికి చెందిన లావణ్యకు, నాకే ఈ పరిస్థితి. మిగతా పదిమందికి ఆయా యూనివర్సిటీలు, కళాశాలలు టికెట్లు, పాకెట్ మనీ కూడా సమకూర్చాయి. - ముద్దరబోయిన రంజిత్, విలువిద్య క్రీడాకారుడు -
కరాటే... కుంగ్‌ఫూ తప్పనిసరి!
మనోజ్ నందం, ప్రియదర్శిని జంటగా వేముగంటి దర్శకత్వంలో రంజిత్ నిర్మిస్తున్న చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. శ్రీకాంత్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలందజేశారు. ఈ వేడుకలో కేవీవీ సత్యనారాయణ, సునీల్‌కుమార్‌రెడ్డి, శ్రీ, శోభారాణి, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘తమకు ఎదురవుతున్న చేదు అనుభవాలను ధైర్యంగా ప్రతిఘటించాలంటే మహిళలు చదువుతోపాటు కరాటే, కుంగ్ఫూల్లాంటి విద్యలు కూడా నేర్చుకోవాలని చెప్పే చిత్రం ఇది’’ అన్నారు. మంచి సందేశం ఉన్న యూత్‌ఫుల్ మూవీ ఇదని, యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమని రంజిత్ చెప్పారు. అబ్బాయిలు, అమ్మాయిలు... ఎవరికైనా సెల్ఫ్ డిఫెన్స్ అవసరమని చెప్పే చిత్రమని మనోజ్ నందం తెలిపారు. తెలుగులో చేసి రెండోచిత్రమని ప్రియదర్శిని అన్నారు.