సూపర్‌స్టార్‌తో నయన | Nayanthara to Play Lead in Upcoming Rajinikanth Movie? | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‌తో నయన

Published Sun, May 17 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

సూపర్‌స్టార్‌తో నయన

సూపర్‌స్టార్‌తో నయన

సూపర్‌స్టార్ తాజా చిత్రం ఎట్టకేలకు ఖరారైంది. మొదట శంకర్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరిగింది. అలాగే లారెన్స్ పేరు కూడా తెరపైకి వచ్చింది. చివరికి మెడ్రాస్ చిత్రం ఫేమ్ రంజిత్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అంతలోనే రంజిత్ ఆశలకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గండికొట్టారని కారణం మెడ్రాస్ చిత్రం తరువాత సూర్య హీరోగా చేస్తానని దర్శకుడు తమ సంస్థతో కమిట్ అయ్యారని నిర్మాత జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఆయన కాస్త పట్టు విడిచి దర్శకుడు రంజిత్‌కు పచ్చజెండా ఊపడంతో ఆయన సూపర్‌స్టార్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో అమితాబ్‌బచ్చన్ తరహాలో రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్రలో నటించనున్నారని సమాచారం.
 
  అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తమిళ నిర్మాత మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదన్నది తాజా సమాచారం. ఇప్పుడీ చిత్రాన్ని విజయ్ హీరోగా ఇంతకుముందు కత్తి చిత్రాన్ని నిర్మించిన లైకా సంస్థ ఈరోస్ ఎంటర్‌టైన్ సంస్థ సంయుక్తంగా నిర్మించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం. ఈమె ఇంతకుముందు సూపర్‌స్టార్‌తో చంద్రముఖి, కుచేలన్ చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. శివాజీ చిత్రంలో రజనీతో సింగిల్ సాంగ్‌కు ఆడారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement