
రాజమౌళి రజనీకాంత్‌తో చిత్రం చేస్తే..
సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డెరైక్ట్ చేయాలని ఆశ ఏ దర్శకుడికి మాత్రం ఉండదు. అలాంటి అవకాశం కోసం చాలామంది ఇప్పటికీ ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం రజనీకాంత్ ఏకకాలంలో రెండు భారీ చిత్రాలను చేస్తున్నారు. అందులో ఒకటి యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో వహిస్తున్న కబాలి. ఇందులో సూపర్‌స్టార్ యంగ్ అండ్ ఓల్డ్ గెటప్‌లలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రెండవది 20వో ఎందిరన్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఇక ఇటీవలే చిత్ర నిర్మాణం ప్రారంభించుకున్న ఈ చిత్రంపై అంచనాలకు హద్దులే లేవన్నట్లుగా పరిస్థితి నెలకొంది. కాగా ఇటీవల ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్యల్ని ప్రముఖదర్శకుడు, వెండి తెరపై వండర్స్‌ను క్రియేట్ చేస్తున్న రాజమౌళి చేశారు.
బాహుబలి చిత్రంతో హాలీవుడ్ దృష్టిని తన వైపు తిరిగి చూసేలా చేసుకున్న ఈయన ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో బదులిచ్చారు. రజనీకాంత్ మీరు దర్శకత్వం చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సూపర్‌స్టార్‌కు తానెలాంటి పాత్రను ఇస్తానో తెలియదు గాని ఆయనతో చిత్రం చేస్తే ఆ చిత్రంలోని మాటలు థియేటర్లలో 10 రోజుల వరకు ప్రేక్షకులకు వినిపించవన్నారు. అంతగా ప్రేక్షకుల క రతాళధ్వనులు, కేరింతలతో థియేటర్లు మారుమ్రోగిపోతాయని బదులిచ్చారు. ఏఆర్‌రెహ్మాన్ మీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉందా అన్న మరో ప్రశ్నకు మన దేశంలో ప్రఖ్యాత కళాకారులెందరో ఉన్నారు. వారందరికీ ఒక్కో వర్కింగ్ స్టైల్ ఉంటుంది.
అలా ఏఆర్ రెహ్మాన్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన ఎక్కువగా రాత్రి వేళల్లో పని చేస్తుంటారు. నేను వేకువ జామున 4, 4.30 గంటలకు నిద్ర లేస్తాను. ఉదయం 7-8 గంటల ప్రాంతంలో నా మెదడు సూపర్‌గాా వర్కు చేస్తుంది. ఆ సమయంలో ఏఆర్ రెహ్మాన్ నిద్రలో ఉంటారు. కాబట్టి మా కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో తెలియద ని రాజమౌళి జోవియల్‌గా అన్నారు.