RRR Promotions: Rajamouli Says He Wants To Make Multi Starrer Movie With Kamal Haasan And Rajini Kanth - Sakshi
Sakshi News home page

కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా రాజమౌళి చిత్రం..?

Published Wed, Mar 23 2022 4:58 AM | Last Updated on Thu, Mar 24 2022 12:50 AM

Rajamouli movie starring Kamal Haasan as villain and Rajini Kant as hero - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్‌ ఇండియా మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో రాజమౌళి, చరణ్, తారక్‌లు ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వూలో రాజమౌళికి మీరు తమిళ హీరోలతో మల్టీస్టారర్‌ చిత్రం చేస్తే ఎవరితో చేస్తారు అనే ప్రశ్న ఎదురైంది.

ఇక దానికి సమాధానంగా కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. ఒకవేల రజినీకాంత్ విలన్‌గా కమల్ హాసన్ హీరోగా ఉన్నా పరవాలేదు. ఇది చాలా సార్లు నా మైండ్‌లో మెదులుతుంటుంది. పూర్తి కథ లేదు కానీ అలా వారిద్దరిని చూడాలని ఓ అభిమానిగా వారితో అలాంటి సినిమా చేయ్యాలని ఉందన్నాడు జక్కన్న.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement