సూపర్‌ డైరెక్టర్‌ల కోసం నిర్మాతల కలలు | Producers dreams for super directors | Sakshi
Sakshi News home page

సూపర్‌ డైరెక్టర్‌ల కోసం నిర్మాతల కలలు

Published Fri, May 12 2017 10:56 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

సూపర్‌ డైరెక్టర్‌ల కోసం నిర్మాతల కలలు - Sakshi

సూపర్‌ డైరెక్టర్‌ల కోసం నిర్మాతల కలలు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్, సూపర్‌ డైరెక్టర్‌ రాజమౌళి... కలిసి సినిమా చేస్తే సూపరుంటుంది. అప్పుడు ఇండియాలో థియేటర్లు చాలవేమో! అంతలా ప్రేక్షకులు ఎగబడతారు. కానీ, కాంబినేషన్‌ను సెట్‌ చేసేదెవరు? అని ఆలోచిస్తున్నారా! భలేవారే... బోల్డంత మంది నిర్మాతలు ఇప్పుడిదే పనిలో ఉన్నారు. ఈ కాంబినేషన్‌లో సినిమా చేయాలని కలలు కంటున్నారు. ‘బాహుబలి’ వంటి భారీ హిట్‌ తర్వాత రాజమౌళితో సినిమా చేయడానికి పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారనేది ఓపెన్‌ సీక్రెట్‌.

కొందరు నిర్మాతలైతే రజనీ–రాజమౌళి కాంబినేషన్‌ను సెట్‌ చేయడానికి ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్నారట! వాళ్ల కలలు ఎంతవరకు సక్సెస్‌ అవుతాయో చూడాలి. ‘‘ఫ్యామిలీతో కలసి భూటాన్‌ హాలిడే ట్రిప్‌కి వెళ్లొచ్చాక తర్వాతి సినిమా గురించి ఆలోచిస్తా’’ అని ఇటీవల రాజమౌళి చెప్పారు. నార్మల్‌గా భారీ సినిమా తర్వాత చిన్న సినిమా తీయడం ఈ దర్శకుడి స్టైల్‌. కానీ, ఇక్కడ రజనీ హీరో అనేది టెంప్ట్‌ చేసే ఆఫర్‌. కథ కుదిరితే రజనీతో చేస్తానని ఓ సందర్భంలో రాజమౌళి అన్నారు. సో.. కథ కుదిరితే కాంబినేషన్‌ కుదిరినట్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement