బాహుబలి రికార్డ్స్ కొట్టేందుకు 15 భాషల్లో..! | 2.0 team plans to beat baahubali records | Sakshi
Sakshi News home page

బాహుబలి రికార్డ్స్ కొట్టేందుకు 15 భాషల్లో..!

Published Wed, May 31 2017 12:54 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి రికార్డ్స్ కొట్టేందుకు 15 భాషల్లో..! - Sakshi

బాహుబలి రికార్డ్స్ కొట్టేందుకు 15 భాషల్లో..!

సౌత్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ రేంజ్కు తీసుకొచ్చిన సినిమా బాహుబలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ఈ సినిమా ఇండియన్ సినిమా రికార్డ్ లన్నింటినీ చెరిపేసింది. ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను సాధించిన బాహుబలి చిత్రాలు రాబోయ్ సినిమాలకు సరికొత్త టార్గెట్స్ను సెట్ చేశాయి. ముఖ్యంగా సౌత్లో భారీగా తెరకెక్కుతున్న రోబో సినిమా సీక్వల్ 2.0 యూనిట్ బాహుబలి రికార్డ్లను బద్ధలు కొట్టేందుకు రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 2.0. అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే బాహుబలి రికార్డ్ లను చెరిపేయాలంటే ఇది సరిపోదని భావిస్తున్న 2.0 యూనిట్ తమ సినిమాను ఏకంగా 15 భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ముందుగా ఈ సినిమాను తమిళ్, తెలుగు, మలాయళం, హిందీతో పాటు ఇంగ్లీష్లోనూ రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

అయితే ఇండియన్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో భారీ మార్కెట్ ఏర్పడటం, దంగల్ సినిమా చైనాలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో పలు విదేశీ భాషల్లోనూ 2.0 రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. రజనీ సరసన అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను 2018లో వేసవి కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే తొలి సారిగా 450 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement