'బాహుబలి' కి రజనీ సార్ రాలేదు | Rajinikanth yet to visit 'Baahubali' sets: Rajamouli | Sakshi
Sakshi News home page

'బాహుబలి' కి రజనీ సార్ రాలేదు

Published Fri, Apr 25 2014 12:24 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

'బాహుబలి' కి రజనీ సార్ రాలేదు - Sakshi

'బాహుబలి' కి రజనీ సార్ రాలేదు

సూపర్ స్టార్ రజనీకాంత్ బాహుబలి షూటింగ్కు వచ్చారని వస్తున్న పుకార్లను ఆ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తొసిపుచ్చారు. బాహుబలి షూటింగ్కు రజనీకాంత్ రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏదో ఓ రోజు తప్పకుండా రజనీ సార్ బాహుబలి షూటింగ్ స్పాట్కు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మహానటుడి రాక కోసం తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. శుక్రవరం చెన్నైలో రాజమౌళి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా సూపర్స్టార్ రజనీకాంత్ బాహుబలి షూటింగ్కు వచ్చారట కదా అంటూ విలేకర్లు రాజమౌళిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో రాజమౌళిపై విధంగా స్పందించారు.

రాజమౌళి అనుమతి ఇస్తే బాహుబలి షూటింగ్లో పాల్గొనాలనుకుంటున్నట్లు అందుకు  రజనీకాంత్ ఇటీవల హైదరాబాద్ విచ్చేసినప్పుడు తన మనసులోని మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీ బాహుబలి షూటింగ్ వెళ్లినట్లు పుకార్లు షికార్లు చేశాయి. జక్కన్న చేతిలో చెక్కబడుతున్న బాహుబలి చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క తదితర నాయకానాయకులు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement