‘మాహిష్మతి’లో ప్రభాస్ ఏం చేస్తున్నాడో చూస్తారా?
హైదరాబాద్: ‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి సృష్టించిన అద్భుతమైన సామ్రాజ్యం ‘మాహిష్మతి’.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘బాహుబలి’ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దిన రాజమౌళి.. ఇప్పుడు ‘బాహుబలి’ సామ్రాజ్యం మాహిష్మతిని నేరుగా సందర్శించే అవకాశాన్ని అభిమానులకు కల్పిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన బాహుబలి సెట్స్ వర్చువల్ రియాల్టీ (వీఆర్) వీడియోను ఆయన మన ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో రాజమౌళితోపాటు ప్రభాస్, రానా, అనుష్క, కట్టప్ప బాహుబలి సెట్స్ గురించి వివరిస్తూ హల్‌చల్ చేశారు.
వీఆర్ బాక్స్‌తో ఈ వీడియోను చూస్తే అచ్చం మాహిష్మతి సామ్రాజ్యంలో ఉండి.. దానిని ఆస్వాదిస్తున్న భావన కలుగుతుంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్, అత్యంత వేగమైన ఇంటర్నెట్, వీఆర్ బాక్స్ ఉంటే చాలు.. 360 డిగ్రీల కోణంలో మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్వయంగా సందర్శించవచ్చునని రాజమౌళి వివరించారు. వీఆర్ బాక్స్ లేకున్నా ఈ వీడియోను చూడొచ్చు కానీ, ఆ థ్రిల్ ఉండదని ఆయన వివరించారు. ‘ఆన్ ద సెట్స్ ఆఫ్ బాహుబలి’ పేరుతో వర్చువల్ రియాల్టీ వీడియోను బాహుబలి యూనిట్ ఆదివారం విడుదల చేసింది.
ఈ వీడియో చూసేతీరును జక్కన మరో వీడియోలో వివరించారు.