బాహుబలి కోసం రానా రిస్క్
దేశవ్యాప్తంగా బాహుబలి సందడి మరోసారి మొదలైపోయింది. ఇప్పటికే బాహుబలి 2 టైటిల్ లోగోను రిలీజ్ చేసిన చిత్రయూనిట్, ఈ నెలంతా సందడి చేసేందుకు రెడీ అవుతోంది. తొలి భాగం కోసం పాత్రలను పరిచయం చేస్తూ సినిమా మీద హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్, రెండో భాగం ప్రమోషన్ కోసం కొత్త ప్లాన్స్ రెడీ చేస్తోంది.
ఇందులో భాగంగా రానా బాహుబలి కోసం తాను ఎలాంటి ఫిజిక్తో రెడీ అయ్యాడో రివీల్ చేశాడు. తన ట్రైనర్తో కలిసి జిమ్లో ఫోజ్ ఇచ్చిన రానా, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్కు పోటీ ఇచ్చే స్థాయిలో కండలు పెంచేశాడు. రెండో భాగంలో రానా రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడు. వయసైన పాత్ర కోసం భారీ కాయంతో కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు.
ఈ క్యారెక్టర్ కోసం ఏకంగా 110 కిలోకు బరువు పెరిగాడు. ఇక యంగ్ లుక్లో కనిపించటం కోసం 15 కిలోలకు పైగా బరువు తగ్గి 92-93 కిలోలకు చేరుకున్నాడు. ఒక్క రానా మాత్రమే కాదు., బాహుబలి పాత్రలో కనిపిస్తున్న ప్రభాస్ కూడా ఇదే స్థాయిలో కండలు పెంచేశాడు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలిలో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో చూడాలి.