బాహుబలికి ఏడాది
జూలై 10, తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. ఒక ప్రాంతీయ చిత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా సాధ్యం కాని రికార్డ్లను సృష్టించడం సాధ్యమే అని నిరూపించిన రోజు. ఒక ప్రాంతీయ దర్శకుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సినిమాను రూపొందించగలడని తెలిసిన రోజు. రెండేళ్ల శ్రమ వెండితెర మీద కనకవర్షం కురిపించిన రోజు. భారతీయ సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన బాహుబలి రిలీజ్ అయిన రోజు.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విజువల్ వండర్ బాహుబలి. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా విడుదలై నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా బాహుబలి రిలీజ్కు ముందు తను ఎంత టెన్షన్ పడ్డాడో అభిమానులకు తెలియజేశాడు దర్శకుడు రాజమౌళి.
భారీగా తెరకెక్కిన బాహుబలి ఒకేసారి తెలుగుతో పాటు తమిళ్, మళయాలం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. సరిగ్గా పదమూడేళ్ల క్రితం జూలై 9న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మళ్లీ పన్నెండేళ్ల తరువాత అదే రోజు బాహుబలి రిలీజ్ సందర్భంగా ఎంతో టెన్షన్ పడుతూ గడిపానని తెలియజేశాడు రాజమౌళి.
13 years back this day was one of the most joyous?
— rajamouli ss (@ssrajamouli) 9 July 2016
Simhadri release.
12 years later one of the most tensed..
Day before Baahubali release.