బాహుబలి యూనిట్కు రాజమౌళి వార్నింగ్ | Rajamoulis warning to the crew of Baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలి యూనిట్కు రాజమౌళి వార్నింగ్

Published Sat, Jun 11 2016 12:42 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలి యూనిట్కు రాజమౌళి వార్నింగ్ - Sakshi

బాహుబలి యూనిట్కు రాజమౌళి వార్నింగ్

దాదాపు నెల రోజులు పాటు షూటింగ్కు విరామం ఇచ్చిన బాహుబలి యూనిట్.., తిరిగి షూటింగ్లో పాల్గొన టానికి రెడీ అవుతోంది. ఈ నెల 13 నుంచి జరగనున్న షెడ్యూల్లో సినిమాకు కీలకమైన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే పక్కా ప్లాన్తో రెడీ అయిన రాజమౌళి.. ప్రభాస్, రానాలపై భారీ యాక్షన్ సీక్వన్స్ను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాడు.

ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళుతున్న యూనిట్ సభ్యులకు రాజమౌళి వార్నింగ్ ఇచ్చాడట. ఇటీవల యూనిట్ సభ్యులందరినీ కలిసిన జక్కన్న, ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్కు సెల్ ఫోన్స్ తీసుకురావద్దని చెప్పాడు. అంతేకాదు సినిమాకు సంబందించిన ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చాడు. తొలి భాగం షూటింగ్ సమయంలో కీలక సన్నివేశం లీక్ అయిన నేపథ్యంలో ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement