ఇద్దరిలో ఆ హీరో సెక్సీగా ఉంటాడు: అనుష్క | Anushka Shetty accepts that Prabhas handsome than rana Daggubati | Sakshi
Sakshi News home page

ఇద్దరిలో ఆ హీరో సెక్సీగా ఉంటాడు: అనుష్క

Published Thu, May 18 2017 10:22 PM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM

ఇద్దరిలో ఆ హీరో సెక్సీగా ఉంటాడు: అనుష్క

ఇద్దరిలో ఆ హీరో సెక్సీగా ఉంటాడు: అనుష్క

హైదరాబాద్‌: ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ అయిన అనుష్క ఇంటర్వ్యూ వీడియోకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇందుకు కారణం రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, రానాతో తన అనుబంధాన్ని స్వీటీ అనుష్క చెప్పడమే. అనుష్క ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్నకు తన సమాధానంగా ప్రభాస్‌ పేరు చెప్పేసింది. అసలు ఏమైందంటే.. బాహుబలిలో నటించిన ప్రభాస్‌, రానాలలో ఎవరు అందంగా ఉంటారని యాంకర్‌ స్వీటీని అడగిన వెంటనే అసలు తడుముకోకుండా ప్రభాస్‌ అందగాడని చెప్పింది.  ఆపై ఇద్దరిలో ఎవరు సెక్సీగా ఉంటారని కూడా మరోప్రశ్నను సంధించింది. మరోసారి ఏ ఆలోచన లేకండానే ప్రభాస్‌ పేరు చెప్పింది అనుష్క.

ఆశ్చర్యపోయి అలాగే తనను చూస్తున్న యాంకర్‌కు.. ఆయన (రానా) తనకు సోదరుడి లాండి వాడని చెప్పింది. అందుకే తాను రానాను బ్రదర్‌ అనే ఎప్పుడూ పిలుస్తానని అంటోంది. బిల్లా, మిర్చి మూవీలతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన అనుష్క, ప్రభాస్‌ బాహుబలి ప్రాజెక్టులో మరోసారి జతకట్టి సక్సెస్‌ అయ్యారు. ప్రస్తుతం బాహుబలి మూవీ సక్సెస్‌ను యూనిట్‌ ఎంజాయ్‌ చేస్తోంది. అనుష్క ప్రస్తుతం జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భాగమతి’  లో నటిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement