రాజమౌళి.. నీ బాహుబలి షూటింగ్ చూడాలి: రజనీ
బాహుబలి షూటింగ్ చూడాలని ఉందని సూపర్ స్టార్ట్ రజనీకాంత్ అనుమతి కోరాడని దర్శకుడు రాజమౌళి ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాజమౌళి ట్విటర్ లో పేర్కొన్నారు.
బాహుబలి షూటింగ్ చూడాలని ఉందని సూపర్ స్టార్ట్ రజనీకాంత్ అనుమతి కోరాడని దర్శకుడు రాజమౌళి ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటన అని రాజమౌళి ట్విటర్ లో పేర్కొన్నారు.
బాహుబలి సెట్ కు రావాలనుకుంటున్నాను. నీ షూటింగ్ చూడాలనుకుంటున్నాను అని రజనీ సార్ అన్నారు. నా జీవితంలో మరిచిపోలేనటువంటి సంఘటనల్లో ఇది ఒకటి. థ్యాంక్యూ సర్ అని అని రాజమౌళి ట్విటర్ లో తెలిపారు.
మే 9 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న రజనీకాంత్ ‘విక్రమసింహ’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ఐమాక్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి, రామానాయుడు, మోహన్ బాబు, రాజమౌళి, సుబ్బిరామిరెడ్డితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ చిత్రంలో దీపిక పదుకొనే, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, నాజర్, శోభన తదితరులు నటించారు. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు.