బాహుబలి 2కి రజనీకాంత్‌ రివ్యూ | Rajinikanth Reviews S S Rajamouli's Film bahubali 2 | Sakshi
Sakshi News home page

బాహుబలి 2కి రజనీకాంత్‌ రివ్యూ

Published Mon, May 1 2017 11:43 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

బాహుబలి 2కి రజనీకాంత్‌ రివ్యూ - Sakshi

బాహుబలి 2కి రజనీకాంత్‌ రివ్యూ

చెన్నై: ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి-2 చిత్రానికి తలైవా, దక్షిణాది ప్రముఖ నటుడు రజనీకాంత్‌ రివ్యూ ఇచ్చారు. భారతదేశం ఎప్పటికీ గర్వంగా చెప్పుకునేంత గొప్ప చిత్రం బాహుబలి -2అన్నారు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి సినిమాను చూసిన ఆయన దర్శక ధీరుడు రాజమౌళిని ఆకాశానికెత్తేశారు. ‘భారతీయ సినిమాకు బాహుబలి-2 గర్వకారణం. దేవీపుత్రుడు(గాడ్‌ ఓన్‌ చైల్డ్‌) రాజమౌళి, అతడి టీంకు నా వందనాలు. ఈ చిత్రం నిజంగా ఓ తురుపుముక్క’  అంటూ ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనికి స్పందించిన రాజమౌళి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

‘తలైవా.... దేవుడే మమ్మల్ని దీవించినట్లుగా ఉంది.. మేమంతా గాల్లో తేలుతున్నాం. ఇంతకంటే పెద్ద ప్రశంస ఉండదు’ తిరిగి రాజమౌళి తలైవాకు రీట్వీట్‌ చేశారు. శుక్రవారం విడుదలైన బాహుబలి 2 చిత్రం రికార్డుల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం ప్రారంభం రోజే రూ.121కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా రికార్డులనే తిరగరాసింది. హిందీ వెర్షన్‌లో కూడా విడుదలై దాదాపు రూ.40కోట్లను వసూలు చేసి ఆమిర్‌ఖాన్‌ దంగల్‌ చిత్రం ఓపెనింగ్‌ డే రికార్డును కూడా తుడిచిపారేసింది. ప్రస్తుతం మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టే దిశగా బాహుబలి-2 దూసుకెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement