ఆదుకుంటే పోలెండ్‌కు... | financial problems from players | Sakshi
Sakshi News home page

ఆదుకుంటే పోలెండ్‌కు...

Published Wed, Jun 25 2014 3:23 AM | Last Updated on Wed, Aug 1 2018 2:36 PM

ఆదుకుంటే పోలెండ్‌కు... - Sakshi

ఆదుకుంటే పోలెండ్‌కు...

దాతల కోసం ఎదురుచూస్తున్న
విలువిద్య క్రీడాకారులు
పట్టించుకోని కేయూ,డిగ్రీ కళాశాల యాజమాన్యం
జూలై 1నుంచే పోలెండ్‌లోచాంపియన్‌షిప్ పోటీలు
ఈనెల 30లోపు వెళ్లకుంటే అంతే..

 ఐదు రోజులే గడువు
క్రీడాభిమానులూ.. స్పందించండి

 
విలువిద్యలో దేశఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో చాటాలని ఉవ్విళ్లూరుతున్న ఇద్దరు యువ క్రీడాకారులకు పేదరికం శాపంగా మారింది. జాతీయస్థాయి ఆర్చరీ పోటీల్లో అసమాన ప్రతిభతో కీర్తిపతాకం ఎగురవేసిన వారికి ఇప్పుడు అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ఆర్థిక పరిస్థితి వెనక్కి గుంజుతోంది. విలువిద్యలో ఆరితేరిన పర్వతగిరి మండలంలోని కల్లెడకు చెందిన ఎం.రంజిత్‌కుమార్, రావూరుకు చెందిన లావణ్యకు జూలై 1 నుంచి పోలెండ్‌లో జరిగే వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా వెళ్లిరావడానికి డబ్బులు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 30వ తేదీలోపు దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

- పర్వతగిరి

నిరుపేద కుటుంబానికి చెందిన రంజిత్‌కుమార్, లావణ్యలు ఇప్పుడు దాతల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. విలువిద్యలో అత్యంత ప్రతిభ కనబరుస్తున్న వీరు నిరాశానిస్పృహల్లో మునిగిపోయారు. జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తం చేసిన ఈ క్రీడాకుసుమాలకు దేశ కీర్తి పతాకను అంతర్జాతీయస్థాయిలో రెపరెపలాడించే అవకాశం వచ్చినా పేదరికం అడుగడుగునా అడ్డుతగులుతోంది. శిక్షణ ఇచ్చినవారు మా వల్ల కాదు పొమ్మంటే.. ప్రభుత్వం పట్టనట్టు ఊరుకుంది. ఫలితంగా వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 8వరకు పోలెండ్ దేశంలో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్ షిప్ పోటీలకు ఎక్కడ దూరమైపోతామో అని బెంగపెట్టుకుంటున్నారు.

 మండలంలోని కల్లెడకు చెందిన ముద్దరబోయి న రంజిత్‌కుమార్, రావూరు గ్రామానికి చెందిన నో ముల లావణ్య ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. రం జిత్‌కుమార్ జార్ఖండ్ రాష్ట్రంలోని టాటా అకాడమీ లో, లావణ్య సెయిల్ అకాడమీలో ఆర్చరీలో శిక్షణ తీసుకుంటున్నారు. గ్రామంలోని ఆర్డీఎఫ్ పాఠశాల లో వీరు 8వ తరగతి చదువుతున్న సమయంలో వి లువిద్యలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. క్రమంగా అందులో ప్రతిభ కనబర్చి పలు పోటీల్లో పాల్గొని పతకాలు అందుకున్నారు. పంజాబ్ రాష్ట్రం లోని పాటియాలాలో గతనెలలో నిర్వహించిన ఆ లిండియా యూనివర్సిటీ గేమ్స్ క్యాంపస్ సెలక్షన్స్ లో ఎంపిక చేసిన 12మందిలో వీరు మూడు, నాలు గు ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. ఈ నెలలో జరిగిన టీం సెలక్షన్స్‌లోనూ మూడో ర్యాంకు సాధించి ప్రతిభకు కొదవలేదని నిరూపించారు.

ఇద్దరివీ పేదకుటుంబాలే..

 రంజిత్‌కుమార్, లావణ్య.. ఇద్దరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే. రంజిత్‌కు ఓ అన్న, అక్కయ్య ఉన్నారు. రంజిత్ చిన్న వయసులో ఉన్నప్పుడే తండ్రి సోమయ్య గుండెజబ్బుతో మరణించాడు. తల్లి సత్తెమ్మ కూలిపనులు చేసుకుంటూ పిల్లలను పోషించింది. ఇక లావణ్య తల్లిదండ్రులు వెంకటమ్మ, ఐలమ్మలు కడు నిరుపేదలు. తండ్రి రావూరు గ్రామ పంచాయతీ కారోబార్‌గా పనిచేస్తుండగా తల్లి దినసరి కూలీ.

రూ.1.30లక్షలు ఉంటేనే..

అద్భుత ప్రతిభతో విజయాలు సాధిస్తూ వస్తున్న రంజిత్, లావణ్యలు ఇద్దరికీ వచ్చే నెలలో పోలెం డ్‌లో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అయితే అక్కడికి వెళ్లి వచ్చేందుకు పెద్దమొత్తంలో డబ్బులు అవసరం కావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఒక్కొక్కరికి దాదాపు రూ.1.30వేలు ఖర్చు అవుతుంది. ఇందుకోసం సంబంధిత కాకతీయ యూనివర్సిటీ రూ.లక్షా పదివేలు, క్రీడాకారులు చదువుకుంటున్న తొర్రూరులోని సాయిరామ్ డిగ్రీ కళాశాల యాజమాన్యం రూ.20వేలు ఇవ్వాల్సి ఉండగా ఎవరూ స్పందించకపోవడంతో వారి భవిత ప్రశ్నార్థకమైంది. దీనికితోడు ప్రభుత్వ సాయం కూడా కరువవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక శిక్షణ ఇస్తున్న సంస్థలు మా బాధ్యత శిక్షణ వరకే అని తప్పించుకోజూస్తున్నాయి. ఈనెల 30వ తేదీలోపు వెళ్లకుంటే పోటీల్లో పాల్గొనే అర్హత కోల్పోతామని, క్రీడాప్రేమికులు పెద్దమనుసుతో తమను ఆదుకుంటే పోటీల్లో పాల్గొని జిల్లాకు, దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారీ క్రీడా కుసుమాలు.
 
 కేయూనే భరించాలి

 విలువిద్య క్రీడాకారుల ఖర్చులు కాకతీయ యూనివర్సిటీనే భరించాలి. కేయూ పరిధిలో చదువుతున్నందున వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత వారిదే. యూనివర్సిటీ పేరును నిలబెట్టేది వారే కాబట్టి విద్యార్థుల ఖర్చులు వారే భరించాల్సి ఉంటుంది.
 - రాచకొం అశోకాచారి, ప్రిన్సిపాల్ , ఆర్డీఎఫ్
 
 
క్రీడారంగంలోకి వచ్చి తప్పుచేశా


ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటుందని ముందే తెలిస్తే ఈ రంగంలోకి వచ్చేవాడినే కాదు. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌కు మన దేశం నుంచి 12 మంది సెలెక్ట్ కాగా ఒకే ప్రాంతానికి చెందిన లావణ్యకు, నాకే ఈ పరిస్థితి. మిగతా పదిమందికి ఆయా యూనివర్సిటీలు, కళాశాలలు టికెట్లు, పాకెట్ మనీ కూడా సమకూర్చాయి.

 - ముద్దరబోయిన రంజిత్, విలువిద్య క్రీడాకారుడు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement