ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా? | Illayathalapathy Vijay next new movie directed by Sundar C budget? | Sakshi
Sakshi News home page

ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా?

Published Sun, Jun 19 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా?

ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా?

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్‌లో ఒక హిస్టారికల్ చిత్ర రూపకల్పనకు కోలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రం, బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి-2 చిత్రాలు బడ్జె ట్ విషయంలో నువ్వా నేనా అన్నంతగా పో టీపడుతున్నాయి. విశేషం ఏమిటం టే ఈ రెండు చిత్రాలు వచ్చే ఎడాది ఇం చు మించు ఒకే సమయంలో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయన్నది గమనార్హం.

ఈ విషయాన్ని అటుంచితే వీటికి మించిన వ్యయంతో ఒక త్రిభాషా చిత్రం తెరకెక్కడానికి రెడీ అవుతోంద న్న ప్రచారం ఇప్పటికే కోలీవుడ్‌టో హల్‌చల్ చేస్తోంది. ఆ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తమ 100వ చిత్రంగా రూపొందించనుందని, ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 350 కోట్ల బడ్జెట్‌లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. అంతే కాదు హిస్టారికల్ కథతో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు సుందర్.సీ హ్యాండిల్ చేయనున్నారన్న విషయం తెలిసిందే.

అయితే ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గానీ, కోలీవుడ్ టాప్ హీరో సూర్య గానీ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. నిర్ణయం కాని అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రస్తుతం ఎస్-3 చిత్రంలో నటిస్తున్న తాను తదుపరి రంజిత్ (కపాలి చిత్రం ఫేమ్)దర్శకత్వంలో నటించనున్నానని స్పష్టం చేశారు. తాజాగా ఈ అత్యంత భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం హల్‌చల్ చేస్తోంది. ఇదే నిజం అయితే విజయ్, సుందర్.సిల తొలి కాంబినేషన్‌లో రానున్న చిత్రం కచ్చితంగా సంచలనమే అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement