Sundar.c
-
హీరో విశాల్‌కు తీవ్ర గాయాలు
సాక్షి, చెన్నై : ప్రముఖ హీరో విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్ ఫోటో ప్రస్తుం వైరల్ అవుతోంది. సుందర్ సి. దర్శకత్వంలో విశాల్ గతంలో 'మదగజరాజా', 'ఆంబల' చిత్రాల్లో నటించారు. వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రమిది. ఈ సినిమాలో మలయాళం యాక్టర్ ఐశ్వర్య లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా టర్కీలో సుమారు 50 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. కాగా ఫైట్ సీన్లను ఎలాంటి డూప్ లేకుండా చేయడం మొదటి నుంచి విశాల్‌కు అలవాటే. గతంలోనూ ’తుప్పరివాలన్’ సినిమా షూటింగ్‌లోనూ ఈ యువహీరో గాయపడిన విషయం తెలిసిందే. ఇక విశాల్ ‘అయోగ్య’ చిత్రం మే 10న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’కి ఇది రీమేక్. వెంకట్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, ఆయన జోడీగా రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించినా చివరికి మే నెలకు వాయిదా పడింది. కానీ ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. -
నయనతారను బతిమలాడుతున్నారట
‘సంఘమిత్ర’ చిత్రంలో నటించాలని, కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం అని దర్శక,నిర్మాతలు హీరోయిన్ నయనతారను బతిమలాడుతున్నారట. ఇంతకీ సంగతేమిటంటే సంఘమిత్ర సినిమాకు ఇంకా కథానాయకి దొరకలేదట. శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చరిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్.సీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలా తర్జనభర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్లపాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే. దీంతో ఎట్టకేలకు జయం రవి, ఆర్యలు కథానాయకులుగా సెట్ అయ్యారు. కథానాయకి ఎంపికకూ అదే పరిస్థితి. నటి శ్రుతిహాసన్ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయికి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్ అనుష్కను అడిగితే ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన తాను మళ్లీ అన్ని కాల్షీట్స్తో ఈ చిత్రం చేయలేనని ఆమె చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్.సి తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిపారసు చేసినా నిర్మాత అందుకు సమ్మతించలేదని ప్రచారం. ఒక దశలో బాలీవుడ్ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కవుట్ కాకపోవడంతో చివరకు నయనతారపై దృష్టి సారించినట్లు తాజా సమాచారం. అయితే ఆమె చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతామని సంఘమిత్రలో రాణి పాత్రను పోషించాలంటూ బతిమలాడే ధోరణికి దిగారని సోషల్ మీడియాలో ప్రచారం. కాగా, తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాల్‌ష్‌ట్స్ ఇవ్వడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. -
సంఘమిత్రలో...
దక్షిణాది భామ దీపికా పదుకొనే ఉత్తరాదిన తిరుగు లేని కథానాయిక అనిపించుకున్నారు. ఈ బ్యూటీని సౌత్ నుంచి పలు ఆఫర్లు వరించినా, డేట్స్ ఖాళీ లేక అంగీకరించలేకపోయారు. ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు సుందర్.సి చారిత్రక నేపథ్యంలో ‘సంఘమిత్ర’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకా హీరోను ఖరారు చేయలేదు. దీపికా పదుకొనేని కథానాయికగా నటింపజేయాలనుకుంటున్నారట. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా పేరున్న సాంకేతిక నిపుణులను ఎంచుకుంటున్నారు సుందర్. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పడుతుందట. -
ఆ భారీ చిత్రంలో ఇళయదళపతా?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక భారీ బడ్జెట్లో ఒక హిస్టారికల్ చిత్ర రూపకల్పనకు కోలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 2.ఓ చిత్రం, బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి-2 చిత్రాలు బడ్జె ట్ విషయంలో నువ్వా నేనా అన్నంతగా పో టీపడుతున్నాయి. విశేషం ఏమిటం టే ఈ రెండు చిత్రాలు వచ్చే ఎడాది ఇం చు మించు ఒకే సమయంలో నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్నాయన్నది గమనార్హం. ఈ విషయాన్ని అటుంచితే వీటికి మించిన వ్యయంతో ఒక త్రిభాషా చిత్రం తెరకెక్కడానికి రెడీ అవుతోంద న్న ప్రచారం ఇప్పటికే కోలీవుడ్టో హల్చల్ చేస్తోంది. ఆ చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ తమ 100వ చిత్రంగా రూపొందించనుందని, ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 350 కోట్ల బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఉంది. అంతే కాదు హిస్టారికల్ కథతో రూపొందనున్న ఈ చిత్రానికి దర్శకుడు సుందర్.సీ హ్యాండిల్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గానీ, కోలీవుడ్ టాప్ హీరో సూర్య గానీ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. నిర్ణయం కాని అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రస్తుతం ఎస్-3 చిత్రంలో నటిస్తున్న తాను తదుపరి రంజిత్ (కపాలి చిత్రం ఫేమ్)దర్శకత్వంలో నటించనున్నానని స్పష్టం చేశారు. తాజాగా ఈ అత్యంత భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో ఇళయదళపతి విజయ్ నటించనున్నట్లు ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇదే నిజం అయితే విజయ్, సుందర్.సిల తొలి కాంబినేషన్లో రానున్న చిత్రం కచ్చితంగా సంచలనమే అవుతుంది. -
పెళ్లికి తొందరేముంది..
పెళ్లి చేసుకోవడం అన్నది మంచి కార్యమే. అయినా దీనికిప్పుడు తొందరేముంది అంటోంది నటి పూనంబాజ్వా. హీరోయిన్గా మంచి స్థానం కోసం పోరాడుతున్న నటి ఈ బ్యూటీ. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా చాలా గ్యాప్ తరువాత ఈ మధ్యే తమిళంలో కాస్త మెరుస్తోంది. ఆంబళ, అరణ్మణై-2 చిత్రాల్లో నటించిన పూనంబాజ్వా తాజాగా సుందర్.సి కి జంటగా నటించిన ముత్తిన కత్తిరికా చిత్రం శుక్రవారం తెరపైకిరానుంది. ఇటీవల ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చక్కర్లు కొట్టింది. ఈ సందర్భంగా పూనంబాజ్వాతో చిన్న భేటీ. ప్ర: తమిళంలో చాలా గ్యాప్ వచ్చినట్లుందే? జ: ఎనిమిదేళ్లుగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్నాను. అయితే నేనెప్పుడూ ఒకే సారి అధిక చిత్రాల్లో కమిట్ అయి బిజీగా ఉండాలని కోరుకోను. క్వాలిటీనే ముఖ్యం అని భావించే నటిని నేను. ఒకటి రెండు చిత్రాలు చేసినా ప్రేక్షకులకు నచ్చాలి. అందుకే ఎక్కువ చిత్రాలు అంగీకరించడం లేదు. హీరో, దర్శకుడు, కథ, అందులో నా పాత్ర,పారితోషికం, కాల్షీట్స్ ఇలా చాలా అంశాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అన్నీ చక్కగా అమరితేనే చిత్రం చేస్తాను. మీరన్న గ్యాప్‌నకు కారణాలు ఇవే. ప్ర: దర్శకుడు సుందర్.సి వరుసగా అవకాశాలు కల్పించడానికి కారణం ఏమంటారు? జ: సుందర్.సి చిత్రాలకు నేనూ రాసి గల నటినయ్యాను. అందుకే ఆయన నాకు వరుసగా అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ముత్తిన కత్తిరికా చిత్రంలో నటించే అవకాశం రావడానికి ఒక కారణం కుష్బు మేడం. ఈ సందర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్ర: గ్లామర్ గురించి మీ అభిప్రాయం? జ: ఒక నటిగా గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. అంతకు మించి చాలా విషయాలున్నాయి. ఒక చిత్రంలో నటించినట్లే మరో చిత్రంలోనూ నటిస్తే బోర్ కొడుతుంది. అందుకే నేనెప్పుడూ వెరైటీ నటనను కోరుకుంటాను. అలాంటి పాత్రల కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తుంటాను. ప్ర: అవార్డుల ఆశ ఉందా? జ: అలాంటి ఆశ నాకు లేదు. మంచి పాత్రలు పోషించాలి. వాటిని చూసి అభిమానులు ఆనందించాలి. అలాంటి నటన అవార్డులు లభిస్తే సంతోషంగా అందుకుంటాను. అంతేకాని అవార్డుల కోసం నటించను. ప్ర: సరే ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయే? జ: అలాంటి వార్తలు ప్రచారం అయిన మాట వాస్తవమే. అయితే జరిగింది నా చెల్లెలి పెళ్లి. అది నా పెళ్లి అనుకుని తప్పుగా ప్రచారం చేశారు. ప్ర: అయితే మీ పెళ్లి ఎప్పుడు? జ: అందుకు తొందరేముంది. నా గురించి నా తల్లిదండ్రులకు చాలా కలల ఉన్నాయి. వారికి నేను మంచి కూతురుగా ఉంటాను.పెళ్లి అన్నది మంచి కార్యమే. దాన్ని దాచవలసిన అవసరం లేదు. పెళ్లి చేసుకునే ముందు అందరికి తెలియజేస్తాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు.