నయనతారను బతిమలాడుతున్నారట | Nayanthara replaces Shruti Haasan in 'Sangamitra | Sakshi
Sakshi News home page

నయనతారను బతిమలాడుతున్నారట

Published Sun, Jun 18 2017 6:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

నయనతారను బతిమలాడుతున్నారట

నయనతారను బతిమలాడుతున్నారట

‘సంఘమిత్ర’ చిత్రంలో నటించాలని, కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం అని దర్శక,నిర్మాతలు హీరోయిన్‌ నయనతారను బతిమలాడుతున్నారట. ఇంతకీ సంగతేమిటంటే సంఘమిత్ర సినిమాకు ఇంకా కథానాయకి దొరకలేదట. శ్రీ తేనాండాళ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చరిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్‌.సీ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలా తర్జనభర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్‌ స్టార్‌ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్లపాటు సంఘమిత్ర కోసం కాల్‌షీట్స్‌ను కేటాయించలేమన్నదే.

దీంతో ఎట్టకేలకు జయం రవి, ఆర్యలు కథానాయకులుగా సెట్‌ అయ్యారు. కథానాయకి ఎంపికకూ అదే పరిస్థితి. నటి శ్రుతిహాసన్‌ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయికి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్‌ అనుష్కను అడిగితే ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన తాను మళ్లీ అన్ని కాల్‌షీట్స్‌తో ఈ చిత్రం చేయలేనని ఆమె చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్‌.సి తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిపారసు చేసినా నిర్మాత అందుకు సమ్మతించలేదని ప్రచారం.

ఒక దశలో బాలీవుడ్‌ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కవుట్‌ కాకపోవడంతో చివరకు నయనతారపై దృష్టి సారించినట్లు తాజా సమాచారం. అయితే ఆమె చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతామని సంఘమిత్రలో రాణి పాత్రను పోషించాలంటూ బతిమలాడే ధోరణికి దిగారని సోషల్‌ మీడియాలో ప్రచారం. కాగా, తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాల్‌ష్‌ట్స్‌ ఇవ్వడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్‌ న్యూస్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement