‘భయంకర వార్తను నమ్మలేకపోతున్నా’ | cannot believe this terrible news, says shruti haasan | Sakshi
Sakshi News home page

‘భయంకర వార్తను నమ్మలేకపోతున్నా’

Published Sun, Feb 25 2018 8:42 AM | Last Updated on Sun, Feb 25 2018 8:42 AM

cannot believe this terrible news, says shruti haasan - Sakshi

శృతి హాసన్‌, శ్రీదేవి (పాత ఫొటోలు)

సాక్షి, ముంబై: ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంపై సినిమా ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అతిలోక సుందరి మరణాన్ని అస్సలు ఊహించలేదని ఆవేదన చెందుతున్నారు. తమ సంతాప సందేశాలను సామాజిక  మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు.

శ్రీదేవి మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, గుండె బద్దలయిందని హీరోయిన్‌ శృతిహాసన్‌ వ్యాఖ్యానించింది. ‘ఈ భయంకర వార్తను నమ్మలేకపోతున్నాను. అసమాన ప్రతిభావంతురాలైన ఆమె మరణించడంపై ఏం మాట్లాడాలే తెలియడంలేద’ని ట్వీట్‌ చేసింది.

సినిమా రంగంలోకి రావడానికి తనకు ప్రేరణగా నిలిచిన శ్రీదేవి లేదంటే దిగ్భ్రంతికి గురయ్యానని హీరోయిన్‌ ప్రియమణి పేర్కొంది. మన మనసుల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారని ట్వీట్‌ చేసింది. శ్రీదేవి మరణం దిగ్భ్రాంతి కలిగించిందని హీరోయిన్‌ నయనతార తెలిపింది. ఆమె నిజమైన తార అని, అత్యంత గౌరవనీయురాలని ప్రశంసించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement