శ్రుతి బాటలో హన్సిక | Hansika will be replaced by Shruthihasan Place in Sanghitra's film. | Sakshi
Sakshi News home page

శ్రుతి బాటలో హన్సిక

Published Tue, Aug 8 2017 2:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

శ్రుతి బాటలో హన్సిక

శ్రుతి బాటలో హన్సిక

తమిళసినిమా: సంచలన హీరోయిన్లలో నటి శ్రుతీహాసన్‌ ఒకరు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించినా సరైన విజయం తన ఖాతాలో ఇప్పటికీ పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో తన తండ్రితో నటిస్తున్న చిత్రం మినహా వేరే చిత్రం కూడా లేదు. మంచి అవకాశం శ్రుతీహాసన్‌కిప్పుడు చాలా అవసరం అని చెప్పకతప్పదు. అదే విధంగా నటి హన్సిక పరిస్థితి దాదాపు అలానే ఉంది. చేతిలో పెద్దగా చిత్రాలు లేవు.

మలయాళంలో మోహన్‌లాల్‌తో విలన్‌ అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే శ్రుతీహాసన్‌ దర్శకుడు సుందర్‌.సీ తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో నటించడానికి ఎంపికై, గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేదికపై జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఆ విషయం పెద్ద వివాదానికి దారి తీసిందన్నది వేరే విషయం.

తరువాత సంఘమిత్ర చిత్రంలో శ్రుతీహాసన్‌ ప్లేస్‌ను నటి హన్సిక భర్తీ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. సుందర్‌.సీ. ఫేవరేట్‌ నటిగా ముద్రపడిన హన్సికతో ఫొటో సెషన్‌ కూడా చేశారనే ప్రచారం జరిగింది. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ భాణీలు కడుతున్నారు. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న తరుణంలో చిత్రం నుంచి హన్సిక కూడా నటించడం లేదనే ప్రచారం తాజాగా సామాజక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చిందనిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement