యువరాణి కోసం మళ్లీ అన్వేషణ ? | Heroine Hansika acting in the movie Sangamitra | Sakshi
Sakshi News home page

యువరాణి కోసం మళ్లీ అన్వేషణ ?

Published Fri, Jun 30 2017 5:42 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

యువరాణి కోసం మళ్లీ అన్వేషణ ?

యువరాణి కోసం మళ్లీ అన్వేషణ ?

సంఘమిత్ర చిత్రం గురించి ఏ ముహూర్తన ప్రకటించారో అప్పటి నుంచి వార్తల్లోనే నానుతోంది. మొదట ఇళయదళపతి విజయ్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబులను కథానాయకులుగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. కథ బాగుందన్న సర్టిఫికెట్ ఇచ్చినా అందులో నటించడానికి వారిద్దరూ ధైర్యం చేయలేదు. కారణం కాల్‌షీట్స్‌ సమస్యేనని సమాచారం. చివరికి యువ హీరోలు జయంరవి, ఆర్యలు సుమారు 200 రోజులు ఈ చిత్రం కోసం త్యాగం చేయడానికి సిద్ధం అయ్యారు.

ఇక కథానాయకి విషయంలోనూ అదే పరిస్థితి.  హీరోయిన్ కోసం పలువురు ప్రముఖ నటీమణుల పేర్లు ప్రచారం అయ్యాయి. శ్రుతీహాసన్‌ నటించడానికి రెడీ అయ్యారు. దీంతో కాస్త రిలాక్స్ అయిన చిత్ర యూనిట్ కు ఆ బ్యూటీ వైదొలగడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.సంఘమిత్రలో యువరాణి కోసం మళ్లీ అన్వేషణ మొదలయ్యింది. మధ్యలో నటి హన్సిక పేరు వినిపించింది. అయితే మార్కెట్ డౌన్ అయిన నటిపై నిర్మాతల వర్గం ఆసక్తిని చూపలేదనే ప్రచారం హల్‌చల్‌ చేసింది. ఆ తరువాత హీరోయిన్ నయనతారతో చర్యలు జరుపుతున్నట్లు టాక్ లీక్ అయ్యింది.

చేతి నిండా చిత్రాలున్న నయనతార సంఘమిత్ర చిత్రం కోసం కాల్‌షీట్స్‌ కేటాయించడానికి సిద్ధంగా లేరనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వద్దు బాబోయ్ అన్న హన్సికనే యువరాణిని చేసే పనిలో చిత్ర వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మతో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. తేనాండాళ్ ఫిలింస్ బాహుబలి తరహాలో బ్రహ్మండంగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం సీ. సుందర్, సంగీతాన్ని ఏఆర్.రెహమాన్ అందిస్తున్నారు. చిత్రం త్వరలోనే సెట్ పైకి వెళ్లనుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement