పెళ్లికి తొందరేముంది.. | poonam bajwa special interview | Sakshi
Sakshi News home page

పెళ్లికి తొందరేముంది..

Published Thu, Jun 16 2016 2:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

పెళ్లికి తొందరేముంది..

పెళ్లికి తొందరేముంది..

పెళ్లి చేసుకోవడం అన్నది మంచి కార్యమే. అయినా దీనికిప్పుడు తొందరేముంది అంటోంది నటి పూనంబాజ్వా. హీరోయిన్‌గా మంచి స్థానం కోసం పోరాడుతున్న నటి ఈ బ్యూటీ. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా చాలా గ్యాప్ తరువాత ఈ మధ్యే తమిళంలో కాస్త మెరుస్తోంది. ఆంబళ, అరణ్మణై-2 చిత్రాల్లో నటించిన పూనంబాజ్వా తాజాగా సుందర్.సి కి జంటగా నటించిన ముత్తిన కత్తిరికా చిత్రం శుక్రవారం తెరపైకిరానుంది. ఇటీవల ఈ అమ్మడు పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చక్కర్లు కొట్టింది. ఈ సందర్భంగా పూనంబాజ్వాతో చిన్న భేటీ.
 
ప్ర: తమిళంలో చాలా గ్యాప్ వచ్చినట్లుందే?
జ:
ఎనిమిదేళ్లుగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తున్నాను. అయితే నేనెప్పుడూ ఒకే సారి అధిక చిత్రాల్లో కమిట్ అయి బిజీగా ఉండాలని కోరుకోను. క్వాలిటీనే ముఖ్యం అని భావించే నటిని నేను. ఒకటి రెండు చిత్రాలు చేసినా ప్రేక్షకులకు నచ్చాలి. అందుకే ఎక్కువ చిత్రాలు అంగీకరించడం లేదు. హీరో, దర్శకుడు, కథ, అందులో నా పాత్ర,పారితోషికం, కాల్‌షీట్స్ ఇలా చాలా అంశాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అన్నీ చక్కగా అమరితేనే చిత్రం చేస్తాను. మీరన్న గ్యాప్‌నకు కారణాలు ఇవే.
 
ప్ర: దర్శకుడు సుందర్.సి వరుసగా అవకాశాలు కల్పించడానికి కారణం ఏమంటారు?
జ:
సుందర్.సి చిత్రాలకు నేనూ రాసి గల నటినయ్యాను. అందుకే ఆయన నాకు వరుసగా అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ముత్తిన కత్తిరికా చిత్రంలో నటించే అవకాశం రావడానికి ఒక కారణం కుష్బు మేడం. ఈ సందర్భంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
 
ప్ర: గ్లామర్ గురించి మీ అభిప్రాయం?
జ:
ఒక నటిగా గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకూడదు. అంతకు మించి చాలా విషయాలున్నాయి. ఒక చిత్రంలో నటించినట్లే మరో చిత్రంలోనూ నటిస్తే బోర్ కొడుతుంది. అందుకే నేనెప్పుడూ వెరైటీ నటనను కోరుకుంటాను. అలాంటి పాత్రల కోసం ఎంత కాలమైనా ఎదురుచూస్తుంటాను.
 
ప్ర: అవార్డుల ఆశ ఉందా?
జ:
అలాంటి ఆశ నాకు లేదు. మంచి పాత్రలు పోషించాలి. వాటిని చూసి అభిమానులు ఆనందించాలి. అలాంటి నటన అవార్డులు లభిస్తే సంతోషంగా అందుకుంటాను. అంతేకాని అవార్డుల కోసం నటించను.
 
ప్ర: సరే ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయే?
జ: అలాంటి వార్తలు ప్రచారం అయిన మాట వాస్తవమే. అయితే జరిగింది నా చెల్లెలి పెళ్లి. అది నా పెళ్లి అనుకుని తప్పుగా ప్రచారం చేశారు.
 
ప్ర: అయితే మీ పెళ్లి ఎప్పుడు?
జ:
అందుకు తొందరేముంది. నా గురించి నా తల్లిదండ్రులకు చాలా కలల ఉన్నాయి. వారికి నేను మంచి కూతురుగా ఉంటాను.పెళ్లి అన్నది మంచి కార్యమే. దాన్ని దాచవలసిన అవసరం లేదు. పెళ్లి చేసుకునే ముందు అందరికి తెలియజేస్తాను. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement