సంఘమిత్రలో...
దక్షిణాది భామ దీపికా పదుకొనే ఉత్తరాదిన తిరుగు లేని కథానాయిక అనిపించుకున్నారు. ఈ బ్యూటీని సౌత్ నుంచి పలు ఆఫర్లు వరించినా, డేట్స్ ఖాళీ లేక అంగీకరించలేకపోయారు. ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్శకుడు సుందర్.సి చారిత్రక నేపథ్యంలో ‘సంఘమిత్ర’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు.
తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇంకా హీరోను ఖరారు చేయలేదు. దీపికా పదుకొనేని కథానాయికగా నటింపజేయాలనుకుంటున్నారట. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా పేరున్న సాంకేతిక నిపుణులను ఎంచుకుంటున్నారు సుందర్. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రనిర్మాణానికి రెండేళ్లు పడుతుందట.