జర్నలిస్ట్ రంజిత్‌కు సీనీ నటుడు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ని కలిసి పరామర్శించాడు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యలను కలిసి.. తన వల్లే తప్పిదం జరిగిందని, ఉద్దేశపూర్వకంగా రంజిత్‌ని కొట్టలేదని చెప్పారు. గాయం బాధ ఏంటో తనకు తెలుసని, రంజిత్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. తనపై దాడి జరిగితే.. జర్నలిస్టు సమాజం మొత్తం అండగా నిలిచిందని, ఆ క్షమాపణలు మీడియాకే చెప్పాలని రంజిత్ కోరడంతో మోహన్ బాబు మీడియాకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. మోహన్ బాబుతో పాటు మంచు మిష్ణు కూడా ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించాడు.
కాగా, ఇటీవల మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన విషయం తెలిసిందే. తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ కేసు పెట్టడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. మరోవైపు తన కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మంచు మోహన్ బాబు కూడా కేసు పెట్టాడు. మంచు మోహన్ బాబు ఇంటి వద్ద జరుగుతున్న గొడవను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేశాడు. ఈ ఘటనలో జర్నలిస్ట్ రంజిత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జర్నలిస్టులంతా ధర్నాకు దిగారు. పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత మోహన్‌బాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు ఆశ్రయించడం… ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించడంతో మోహన్‌బాబు కనపడకుండా పోయారు. దీంతో మంచు మోహన్‌బాబు కనపడుటలేదు…! అరెస్ట్ భయంతో ఎక్కడికెళ్లారు…? ఇప్పుడు ఎక్కడున్నారు…? అంటూ రెండ్రోజులుగా రచ్చ రేగింది. దీనిపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. 'నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా ముందస్తు బెయిల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్య సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయవద్దని మీడియాను కోరుతున్నా' అని క్లారిటీ ఇచ్చారు. తాజాగా రంజిత్‌ని కలిసి పరామర్శించాడు.
Comments
Please login to add a commentAdd a comment