సాక్షి, మహబూబ్‌నగర్: రుణమాఫీకి సంబంధించి రై తులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్ జీడీ ప్రియదర్శిని భరోసాఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం 25శాతం కింద రూ.682 కోట్లు మంజూ రు చేసిందని, త్వరలో మిగతా 75శాతం రు ణం మంజూరవుతుందని స్పష్టంచేశారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ప్రస్తుత రుణమాఫీ కేవలం పంటల బీమాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవలం 25శాతం నిధులు మాత్రమే మంజూరుచేసిందని వివరించారు. ప్రభుత్వం మంజూరుచేసిన రూ.682 కోట్లలో ఇప్పటికే దాదాపు 80శాతం బ్యాంకులకు అందజేశామని, మిగతా బ్యాంకులు ఖాతాలు తెరవగానే అందజేస్తామని వెల్లడించారు. కావునా పాత రుణాలను మరిచి కొత్తలోన్లు ఎంత అవకాశముంటే దానిప్రకారం బ్యాంకులు చెల్లిస్తాయని తెలిపారు.
చెల్లింపు విధానం ఇలా..
ప్రస్తుత రుణంలో 25శాతం ప్రభుత్వం మాఫీచేసింది. పాతరుణం 75శాతం ఉంటుంది. మాఫీ అయిన 25శాతం రుణానికి కిసాన్ క్రెడిట్‌కార్డు(కెసీసీ)నామ్స్ ప్రకారం అదనంగా రుణం ఇస్తారు. ఈ ప్రకారంగా కొత్తగా 55శాతం రుణం పొందే అవకాశముందని కలెక్టర్ వివరించారు. ఉదాహరణకు ఒక రైతు రూ.10వేల రుణం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వం రూ.2,500 మాఫీ చేసింది. కేసీసీ నామ్స్ ప్రకారం అదనంగా 30శాతం లోన్ కలుపుకుని కొత్తగా రూ.5,500రుణం పొందవచ్చు.
అయితే భూమి విస్తీర్ణం, స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఏ పంట ఎంతమేరకు ఇవ్వొచ్చనే దానిపై రుణం అందుతుందని స్పష్టంచేశారు. రుణమాఫీ కోసం అర్హత సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి ఎంత ఉందనే విషయాన్ని పేర్కొంటూ రెవెన్యూ అధికారి, ఏ పంట ఎంతమేర సాగుచేశారనే విషయాన్ని మండల వ్యవసాయాధికారి గుర్తిస్తారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 30వేల డాక్యుమెంటేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు.
కొత్తరుణం తీసుకోకపోవడమే ఉత్తమం
ప్రస్తుతం బ్యాంకులు కొత్తగా ఇచ్చేరుణాలను రైతులు తీసుకోకపోవడమే ఉత్తమమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రుణాలు కేవలం పంటబీమాను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనాఅనుకోని కరువు, వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు లబ్ధిచేకూరే ఉద్ధేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా చెల్లిస్తేనే పంటలబీమా వర్తిస్తుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని వివరించారు.
ఆందోళన వద్దు
Published Mon, Sep 29 2014 1:20 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement