మహిళలకు స్ఫూర్తిగా... | Manoj Nandam and Priyadarshini's 'Youthful Love' | Sakshi
Sakshi News home page

మహిళలకు స్ఫూర్తిగా...

Published Wed, Jul 30 2014 12:32 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

మహిళలకు స్ఫూర్తిగా... - Sakshi

మహిళలకు స్ఫూర్తిగా...

 సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని వేముగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. మనోజ్ నందం, ప్రియదర్శిని, అజిత్, థ్రిల్లర్ మంజు ముఖ్య తారలుగా రాధారం రాజలింగం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మహిళల సమస్యలను చూపించడంతో పాటు పరిష్కారం కూడా చెప్పాం. తల్లిదండ్రులకు సందేశం కూడా ఇస్తున్నాం. ప్రధానంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ, కమర్షియల్ థ్రిల్లర్‌గా సాగుతుంది’’ అని చెప్పారు. ప్రతి మహిళా ఆత్మరక్షణార్థం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచే చిత్రమని మనోజ్ నందం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement