Manoj nandam
-
ఎన్నో కథలు
మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ గౌరీ, చిన్నారి ముఖ్య పాత్రల్లో వలస కార్మికుల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వలస’. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రయాణంలో ప్రేమికులైన ఒక ప్రేమజంట.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం.. ప్రియుడితో మాట్లాడ్డానికి ఫోన్ దొరక్క తల్లడిల్లే ఓ ప్రేయసి.. నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న ఒక ఆడపడుచు... ఇలా ఎన్నో కథలు. అందరి ఆరాటం ఒక నీడకి చేరాలని, అందరి అడుగులు భవిష్యత్తు వైపు. కరోనా సమయంలో మన కళ్ల ముందు జరిగిన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘ఒక వలస కార్మికుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను’’ అన్నారు గాజువాకకు చెందిన తులíసీ రామ్. -
మంచి ప్రేమకథ
మనోజ్ నందం, సౌందర్య జంటగా నటించిన చిత్రం ‘ఎక్కడ నా ప్రేమ’. ఏఎండీ హుస్సేన్ దర్శకత్వంలో గాయత్రీ సినీ క్రియేషన్స్ సమర్పణలో ఎస్. రామకృష్ణ, వడ్డే గోపాల్ నిర్మించారు. ఘనశ్యామ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎస్. రామకృష్ణ, వడ్డే గోపాల్ మాట్లాడుతూ– ‘‘రెండు తరాల వ్యక్తిత్వాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమే జీవితంగా బతికే యువత నిర్ణయాలు, పిల్లల బాగు కోసం తపించే తల్లిదండ్రుల ఆరాటాలు కథలో ప్రధాన అంశాలు. స్వేచ్ఛ కోరుకునే యువతరం, అనుభవాన్ని చూసిన పెద్దలను ప్రతిబింబించేలా పాత్రలుంటాయి. ఆంక్షలు పెట్టిన కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన ఓ అమ్మాయిని కాపాడేందుకు యువకుడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం. మంచి ప్రేమకథతో సినిమా ఉంటుంది. ప్రేమికుల్లోని ఆకర్షణ, మనస్పర్థలను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. -
భారీ వర్షాలకు యంగ్ హీరో కారు ధ్వంసం
భాగ్యనగరంలో గత రాత్రి కురిసిన వర్షం కారణంగా జరిగిన ప్రమాదంలో తెలుగు సినీ నటుడు మనోజ్ నందం కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి గచ్చిబౌలిలోని ఓ ప్రహరీ గోడ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లపై పడింది. బీఎస్ ఎన్ ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో హీరో మనోజ్ నందం కారు పూర్తి ధ్వంసం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు మనోజ్ నందం. 'భారీ వర్షాల కారణంగా ఓ గోడ కూలి కొన్ని కార్ల మీద పడింది. అందులో నా కారు కూడా ఉంది. అదృష్టావశాత్తు ఆ కార్లలో ఎవరూ లేరు' అంటూ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను తన ఫేస్ బుక్ పేజ్ లో పొస్ట్ చేశాడు మనోజ్. -
దేశం కోసం
మనోజ్ నందం, ప్రియసింగ్ జంటగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో హసీబుద్దిన్ నిర్మించిన ‘మనసైనోడు’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ సినిమా పాటలను గోపినాథ్ రెడ్డి, ట్రైలర్‌ను ‘సంతోషం’ ఎడిటర్ సురేశ్ కొండేటి రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ కథలో కుటుంబ కథ జోడించాం. యువకుల్లో దేశభక్తిని నింపేలా ఈ సినిమా ఉంటుంది. ‘జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత’ అని భారతదేశ గొప్పతనం గురించి ప్రతి భారతీయుడు పాడుకునేలా స్వర్గీయ సినారె రచించారు. మగవాళ్ల జీవితాల్లో మహిళలు లేకపోతే ఎంత నష్టమో భాస్కరభట్ల కాస్త చిలిపిగా ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘నేను వేరే దేశంలో ఉన్నా మన దేశం కోసం ఏదో చేయాలనిపించి, ఈ సినిమా తీశా’’ అన్నారు హసీబుద్దిన్. -
మా నమ్మకం నిజమైంది
‘‘స్టార్స్ ఎవరూ లేకపోయినా కథ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు మా నమ్మకం నిజమై మంచి విజయం సాధించింది’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, సింధుతులాని ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ పత్రికలవారితో మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి చెప్పిన కథ నచ్చడంతో నాతో కలిసి నటుడు ధన్‌రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మా సంస్థలో ఇది 75వ సినిమా. మొత్తం 125 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని సన్నివేశాలకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. -
ధనలక్ష్మి ఎవరికి సొంతం?
కొంతమంది యువకు లకు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బు దొరుకు తుంది. ఆ డబ్బు ఎవరిది... వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ధనలక్ష్మి తలుపు తడితే’. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి ముఖ్యతారలుగా తుమ్మలపల్లి రామసత్యనారా యణ నిర్మించారు. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరా బాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ-‘‘కథ బాగుంది. కానీ స్టార్స్ ఎవరూ లేర ని సందేహించా. ధన్‌రాజ్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటానని చెప్పడంతో ధైర్యంగా నిర్మించా’’ అని చెప్పారు. ‘‘ఏడాది క్రితం దర్శకుడు కథ చెప్పారు. కానీ నిర్మాతే దొరకలేదు. దర్శకుడు అచ్యుత్ నాతోనే చేయాలని వెయిట్ చేశాడు. అందుకే ఈ సినిమా తీశా’’ అని ధన్‌రాజ్ చెప్పారు. -
ప్రేమ కోసమై...
‘‘ప్రేమకథ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అని హీరో మనోజ్ నందం అంటున్నారు. మానస్ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై స్వీయదర్శకత్వంలో రాజ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘అదరగొట్టు’. పాటల రికార్డింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తన ప్రేమ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని ఓ యువకుడి కథ ఇదనీ, టైటిల్‌కు తగ్గట్టే ఈ సినిమా హుషారుగా ఉంటుందనీ దర్శక, నిర్మాతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏలూరి నాయుడు. -
వర్ధమాన నటుడు మనోజ్‌కు మాతృవియోగం
మణికొండ (హైదరాబాద్): బాల నటునిగా, పలు సినిమాల్లో హీరోగా నటించిన వర్దమాన నటుడు మనోజ్ నందం తల్లి ఉషాకిరణ్(70) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్‌తో ఆమె బాధపడుతుండగా...శనివారం సాయంత్రం పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో మణికొండలోని నివాసంలో మృతి చెందారు. ఆమె స్థానికంగా ప్లే స్కూల్ నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని పలువురు వర్ధమాన నటులు, జబర్దస్త్ టీం సభ్యులు వచ్చి నివాళులర్పించారు. -
లాభం తెచ్చే ధనలక్ష్మి
‘‘కొన్ని పరిస్థితుల కారణంగా అనుకోకుండా ఈ చిత్రానికి భాగస్వామి అయ్యా. మనోజ్ నందం, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ నా మీద ఉన్న అభిమానంతో పారితోషికం తీసుకోకుండా చేశారు. ఇతరులు నామమాత్రం పారితోషికం తీసుకుని ఈ సినిమా చేశారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నటుడు ధనరాజ్ అన్నారు. మాస్టర్ సుక్కురామ్ సమర్పణలో ధనరాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, అనిల్ కల్యాణ్, తాగుబోతు రమేశ్ తదితరులు ముఖ్య తారలుగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ధనలక్ష్మీ తలుపు తడితే’. సాయి అచ్యుత్ చిన్నారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బోలో శావలి పాటలు స్వరపరిచారు. ఈ సినిమా ప్రచార చిత్రాలను నిర్మాత కె.ఎల్. దామోదర్, దర్శకురాలు నందిని విడుదల చేశారు. మొదట్లో సంకోచించినా, ఇప్పుడీ చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉందని రామసత్యనారాయణ అన్నారు. ఈ ధనలక్ష్మీ లాభం తెచ్చే సినిమా అవుతుందని అతిథులు పేర్కొన్నారు. -
వైవిధ్యమైన ప్రేమకథ...
కృష్ణ, సంతోషి జంటగా అంకయ్య ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జగన్ యాదవ్ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నాగసాయి ఆకుల దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి మనోజ్ నందం కెమెరా స్విచాన్ చేయగా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. రాజ్ కందుకూరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వైవిధ్యమైన ప్రేమకథాంశంతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుంది’’ అని నిర్మాత తెలిపారు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు అన్నారు. -
మంచి వినోదంతో...
‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. పరిశ్రమ బాగుండాలంటే చిన్న చిత్రాలు చాలా రావాలి’’ అని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మనోజ్ నందం, మాదాల రవి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అలౌకిక. మణి సమర్పణలో భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో డా. జేఆర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్‌కుమార్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణా ప్రభుత్వానికి చిన్నా, పెద్దా తేడా లేదనీ, అన్ని సినిమాలూ ఒకటే అని చెప్పడానికే నాయిని నరసింహారెడ్డి ఈ వేడుకకు విచ్చేశారనీ, ఈ చిత్రంలో మంచి పాత్ర చేశానని మాదాల రవి అన్నారు. మంచి కథతో రూపొందించామని దర్శకుడు అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని సంగీత దర్శకుడు తెలిపారు. హార్రర్, కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంచి కామెడీ ఉందని నిర్మాత అన్నారు. నిర్మాతలు సి. కల్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మద్దినేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రియ సఖితో...
మనోజ్ నందం, స్మితిక ఆచార్య, మోనికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఓ చెలియా... నా ప్రియసఖియా’. పి.రమేశ్ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. రమేశ్ బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని వర్గాలకూ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. సాకేత్‌సాయిరామ్ స్వరాలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి’’ అని తెలిపారు. -
నిజ జీవిత ప్రేమకథ
‘‘ఇది మా దర్శకుడి నిజజీవిత ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది. చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని హీరో మనోజ్ నందం చెప్పారు. మనోజ్ నందం, స్మితిక ఆచార్య జంటగా బాలా. జి దర్శకత్వంలో సందిరి గిరి, తన్నీరు సింహాద్రి నిర్మిస్తోన్న ‘ఏ రోజైతే చూశానో’... పాటల సీడీని సీనియర్ నటుడు దేవదాస్ కనకాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘నా శిష్యుడైన బాలా. జి దర్శకునిగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. నాగచైతన్యకు ‘ఏమాయ చేసావె’లా, మనోజ్ నందంకు ఈ సినిమా నిలిచిపోతుందని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదని నిర్మాతలు తెలిపారు. హేమాస్ మీడియా అధినేత కె. సురేశ్‌బాబు, నిర్మాత దామోదర్ ప్రసాద్, లక్ష్మీదేవి కనకాల, వీరశంకర్, చంద్రమహేశ్ తదితరులు మాట్లాడారు. -
ఓ చెలియా నా ప్రియసఖియా’ స్టిల్స్
-
‘ఓ చెలియా నా ప్రియసఖియా’ ఆడియో
-
ప్రేమ గొప్పదనం...
మనోజ్ నందం, స్మితిక, మౌనిక ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. స్వీయదర్శకత్వంలో రమేష్ బాబుల్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వచ్చే నెలలో పాటలను, చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రేమ గొప్పదనం, మాధుర్యం తెలిపే చిత్రమిదని, మనోజ్ నందం అద్భుతంగా నటించాడని, సాకేత్ నాయుడు చక్కని స్వరాలు ఇచ్చారని రమేష్ బాబుల్‌రెడ్డి చెప్పారు. -
భయపెడుతూ వినోదం
‘‘హారర్ కామెడీతో పాటు సందేశం ఉన్న సినిమా ఇది’’ అని దర్శకుడు భానుకిరణ్ చల్లా చెప్పారు. బ్రహ్మాజీ, మనోజ్ నందం, హరిణి, మాదాల రవి, ఉత్తేజ్ ముఖ్యతారలుగా జె. రామారావు నిర్మిస్తున్న ‘అలౌకిక’ చిత్రం పూజా కార్యక్రమాలు మంగళవారం హైదరాబాద్‌లో జరిగాయి. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు మాదాల రవి, మనోజ్‌నందం, సంగీత దర్శకుడు ప్రమోద్, కెమెరామేన్ సూర్యప్రకాశ్‌రావు మాట్లాడారు. న్యాయం ప్రకారం పోరాడుతున్నా... - మాదాల రవి లైంగిక వేధింపుల ఆరోపణలను ఇటీవల ఎదుర్కొన్న నటుడు, నిర్మాత మాదాల రవి తొలిసారిగా ఆ వ్యవహారంపై ఈ ప్రెస్మీట్లో పెదవి విప్పారు. ‘‘నాపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలే. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. న్యాయం ప్రకారం పోరాడుతున్నా. నాకు న్యాయవ్యవస్థపై నూటికి నూరుశాతం నమ్మకం ఉంది. ఆ సంఘటన జరిగిన రాత్రే నేను బెయిల్ తీసుకున్నాను. అంతే తప్ప నేను జైలుకు వెళ్లలేదు’’ అని మాదాల రవి తెలిపారు. -
మహిళలకు స్ఫూర్తిగా...
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని వేముగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. మనోజ్ నందం, ప్రియదర్శిని, అజిత్, థ్రిల్లర్ మంజు ముఖ్య తారలుగా రాధారం రాజలింగం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మహిళల సమస్యలను చూపించడంతో పాటు పరిష్కారం కూడా చెప్పాం. తల్లిదండ్రులకు సందేశం కూడా ఇస్తున్నాం. ప్రధానంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్ అయినప్పటికీ, కమర్షియల్ థ్రిల్లర్‌గా సాగుతుంది’’ అని చెప్పారు. ప్రతి మహిళా ఆత్మరక్షణార్థం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని దర్శకుడు, మహిళలకు స్ఫూర్తిగా నిలిచే చిత్రమని మనోజ్ నందం తెలిపారు. -
యూత్ ఫుల్ లవ్ మూవీ హాట్ స్టిల్స్
-
ఒక క్రిమినల్ ప్రేమ కథ మూవీ ఆడియోలాంచ్
-
ప్రతిభకు వేదిక ఇది
‘‘నేను చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. గేయ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాను. సంగీత దర్శకునిగా మాత్రం అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయాను. నాలాగా స్ట్రగుల్ అవుతోన్న ప్రతిభావంతులకు వేదికగా ఈ సినిమా చేశాం’’ అని చిన్ని చరణ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అదీ లెక్క’ ఈ నెల 9న విడుదల కానుంది. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి అన్విల్ ముఖ్య తారలుగా మల్లేష్ కొండేటి సమర్పణలో చిన్ని చరణ్, రమ్య ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తన ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సినిమాతో చక్కటి అవకాశం దొరికిందని మనోజ్ నందం చెప్పారు. ఈ వేడుకలో సాయికార్తీక్, మహి, ప్రియాంక, వినాయకరావు, సురేష్ కొండి పాల్గొన్నారు. -
'ఈజీ మనీ' కోసం ఆశపడే 'లేజీ బోయ్స్' స్టిల్స్
-
సున్నితమైన భావోద్వేగాలతో ‘నిన్ను చూశాక’
మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్ను చూశాక’. స్వీయ దర్శకత్వంలో రాజా దాసరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మా ణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో పాటలను, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే వినోదాత్మక ప్రేమకథ ఇది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రేమ గురించి తెలిసినవాళ్లనీ ఆకట్టుకుంటాయి. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో సరికొత్త పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఓ ఎస్సెట్ అవుతుంది. ఇందులో ఉన్న ఐదు పాట లకు చిన్నికృష్ణ మంచి స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. -
శీనుగాడి మనసులో శిరీష
మనోజ్ నందం కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రేమప్రయాణం’. ‘శీనుగాడి మనసులో శిరీష’ అనేది ఉపశీర్షిక. నీతూ అగర్వాల్ కథానాయిక. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు. కె.మస్తాన్‌వలి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 6న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ హైలైట్‌గా నిలుస్తుంది. ఎలేందర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వచ్చింది. అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది’’ అని తెలిపారు. అమ్మాయి ప్రేమలో పడి కన్నతల్లికి, సొంత ఊరుకి దూరమైన ఓ బీటెక్ కుర్రాడి కథ ఇదని, చివరకు తన తల్లిని ఏలా చేరుకున్నాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు చెప్పారు. -
మనోజ్ నందం కథానాయకునిగా ‘సత్యవతి’
ఓ ఫొటో జర్నలిస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ నిమ్తితం ఓ ప్రాంతానికి వెళతాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయపెట్టే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయంలో అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక వీరిద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘సత్యవతి’. మనోజ్ నందం కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.ఆర్.వీరంరెడ్డి దర్శకుడు. వి.ఎస్.కె.రెడ్డి నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి భారతీ సిమెంట్స్ మల్లారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, వి.సముద్ర క్లాప్ ఇచ్చారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. వాణిజ్య అంశాలు మేళవింపుతో సాగే థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు చెప్పారు. సెప్టెంబర్ 10 నుంచి షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు. పముఖ మీడియా సంస్థలో పనిచేసే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా నటిస్తున్నానని, తన కెరీర్‌కి ఈ సినిమా మేలి మలుపుగా నిలుస్తుందని మనోజ్‌నందం నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా వైఎస్ఆర్ సీపీ నేత ఇ.వి.సుదర్శనరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎ.జయకుమార్, కెమెరా: సుధాకరరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: రాజ్‌కిరణ్, నిర్మాణం: శ్రీశివసాయికిషోర్ క్రియేషన్స్.