భారీ వర్షాలకు యంగ్ హీరో కారు ధ‍్వంసం | hyderabad rains manoj nandam car damaged | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలకు ధ్వంసమైన యంగ్ హీరో కారు

Published Tue, Oct 10 2017 4:32 PM | Last Updated on Tue, Oct 10 2017 7:27 PM

Manoj Nandam car

భాగ్యనగరంలో గత రాత్రి కురిసిన వర్షం కారణంగా జరిగిన ప్రమాదంలో తెలుగు సినీ నటుడు మనోజ్ నందం కారు ధ్వంసమైంది. సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన వర్షానికి గచ్చిబౌలిలోని ఓ ప్రహరీ గోడ కూలి అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లపై పడింది. బీఎస్ ఎన్ ఎల్ టెలికాం ట్రైనింగ్ సెంటర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో హీరో మనోజ్ నందం కారు పూర్తి ధ్వంసం అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు మనోజ్ నందం. 'భారీ వర్షాల కారణంగా ఓ గోడ కూలి కొన్ని కార్ల మీద పడింది. అందులో నా కారు కూడా ఉంది. అదృష్టావశాత్తు ఆ కార్లలో ఎవరూ లేరు' అంటూ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను తన ఫేస్ బుక్ పేజ్ లో పొస్ట్ చేశాడు మనోజ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement