
ప్రియ సఖితో...
మనోజ్ నందం, స్మితిక ఆచార్య, మోనికా సింగ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘ఓ చెలియా... నా ప్రియసఖియా’. పి.రమేశ్ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. రమేశ్ బాబుల్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాలకూ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. సాకేత్‌సాయిరామ్ స్వరాలు ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్నాయి’’ అని తెలిపారు.