మంచి ప్రేమకథ | new movie ekkada na prema updates | Sakshi
Sakshi News home page

మంచి ప్రేమకథ

Published Wed, Jan 31 2018 12:29 AM | Last Updated on Wed, Jan 31 2018 12:30 AM

new movie ekkada  na prema updates - Sakshi

మనోజ్‌ నందం, సౌంద

మనోజ్‌ నందం, సౌందర్య జంటగా నటించిన చిత్రం ‘ఎక్కడ నా ప్రేమ’. ఏఎండీ హుస్సేన్‌ దర్శకత్వంలో గాయత్రీ సినీ క్రియేషన్స్‌ సమర్పణలో ఎస్‌. రామకృష్ణ, వడ్డే గోపాల్‌ నిర్మించారు. ఘనశ్యామ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎస్‌. రామకృష్ణ, వడ్డే గోపాల్‌ మాట్లాడుతూ– ‘‘రెండు తరాల వ్యక్తిత్వాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. ప్రేమే జీవితంగా బతికే యువత నిర్ణయాలు, పిల్లల బాగు కోసం తపించే తల్లిదండ్రుల ఆరాటాలు కథలో ప్రధాన అంశాలు.

స్వేచ్ఛ కోరుకునే యువతరం, అనుభవాన్ని చూసిన పెద్దలను ప్రతిబింబించేలా పాత్రలుంటాయి. ఆంక్షలు పెట్టిన కుటుంబ సభ్యులను వదిలి వెళ్లిన ఓ అమ్మాయిని కాపాడేందుకు యువకుడు చేసిన ప్రయత్నమే ఈ చిత్రం.  మంచి ప్రేమకథతో సినిమా ఉంటుంది. ప్రేమికుల్లోని ఆకర్షణ, మనస్పర్థలను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. ఫిబ్రవరి 22న మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement