అమ్మాయి వల్ల ఏం జరిగింది? | 'O Pilla Nee Valla' Trailer launched | Sakshi
Sakshi News home page

అమ్మాయి వల్ల ఏం జరిగింది?

Published Sat, Feb 18 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

అమ్మాయి వల్ల  ఏం జరిగింది?

అమ్మాయి వల్ల ఏం జరిగింది?

కృష్ణచైతన్య, రాజేశ్‌ రాథోడ్, మోనికా సింగ్, షాలు చౌరాసియా ముఖ్య తారలుగా కిశోర్‌ స్వీయ దర్శకత్వంలో బిగ్‌ విగ్‌ మూవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘ఓ పిల్లా నీ వల్ల’. మధు పొన్నాస్‌ స్వరపరిచిన పాటల సీడీలను నిర్మాత బెల్లంకొండ సురేశ్, ట్రైలర్‌ను మరో నిర్మాత రాజ్‌ కందుకూరి విడుదల చేశారు. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తొలి సీడీ స్వీకరించారు.

‘‘ఓ అమ్మాయి వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య ఏం జరిగిందనేది ఈ చిత్రకథ. యూత్‌ సహా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. అందరూ తమ సొంత సినిమాగా భావించి పనిచేశారు. మధు మంచి సంగీతాన్నిచ్చారు’’ అన్నారు దర్శక–నిర్మాత కిశోర్‌. ఈ వేడుకలో నిర్మాత లగడపాటి శ్రీధర్, నటి శ్రీముఖి తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement