
మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ గౌరీ, చిన్నారి ముఖ్య పాత్రల్లో వలస కార్మికుల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వలస’. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రయాణంలో ప్రేమికులైన ఒక ప్రేమజంట.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం.. ప్రియుడితో మాట్లాడ్డానికి ఫోన్ దొరక్క తల్లడిల్లే ఓ ప్రేయసి.. నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న ఒక ఆడపడుచు... ఇలా ఎన్నో కథలు. అందరి ఆరాటం ఒక నీడకి చేరాలని, అందరి అడుగులు భవిష్యత్తు వైపు. కరోనా సమయంలో మన కళ్ల ముందు జరిగిన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘ఒక వలస కార్మికుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను’’ అన్నారు గాజువాకకు చెందిన తులíసీ రామ్.
Comments
Please login to add a commentAdd a comment