chinnari
-
ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు : బాలిక తండ్రి
-
ఎన్నో కథలు
మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ గౌరీ, చిన్నారి ముఖ్య పాత్రల్లో వలస కార్మికుల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వలస’. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రయాణంలో ప్రేమికులైన ఒక ప్రేమజంట.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం.. ప్రియుడితో మాట్లాడ్డానికి ఫోన్ దొరక్క తల్లడిల్లే ఓ ప్రేయసి.. నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న ఒక ఆడపడుచు... ఇలా ఎన్నో కథలు. అందరి ఆరాటం ఒక నీడకి చేరాలని, అందరి అడుగులు భవిష్యత్తు వైపు. కరోనా సమయంలో మన కళ్ల ముందు జరిగిన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘ఒక వలస కార్మికుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను’’ అన్నారు గాజువాకకు చెందిన తులíసీ రామ్. -
చిన్నారిని కాపాడేందుకు కొనసాగుతున్న చర్యలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిపోయిన 19 నెలల చిన్నారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి 12 గంటల నుంచి చిన్నారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బాలికను రక్షించేందుకు ఆధునిక పరికరాలతో ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బోరుబావిలో పడిన చిన్నారులను రక్షించడంలో నైపుణ్యం కలిగిన నల్లగొండ జిల్లాకు చెందిన పుట్ట కరుణాకర్ బృందం సైతం వారికి సహకారం అందిస్తోంది. బోరుబావికి సమాంతరంగా పొక్లెయిన్‌తో గుంత తవ్వారు. బోరులోకి ఆక్సిజన్ పంపుతున్నారు. చిన్నారికి ధైర్యం కలిగించేందుకు సిబ్బంది తల్లితో మాట్లాడించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందనరావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్ల మండలం చన్వెల్లి పంచాయతీ పరిధిలోని ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం 6.30కి ఈ సంఘటన జరిగింది. యాదయ్య, రేణుక దంపతుల చిన్నకూతురు చిన్నారి ఆడుకుంటూ సమీప పొలంలోని బోరుబావిలో పడిపోయింది. చిన్నారి క్షేమంగా బయటపడాలని గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. -
చూస్తే...భయమేస్తుంది!
‘‘హారర్ చిత్రాలంటే నేనంత భయపడను. దెయ్యాలను చూసి నవ్వుకుంటాను. ఈ చిత్రం మామూలు హారర్ కాదు... చాలా భయపెట్టేలా ఉంటుంది. థియేటర్లో సినిమా చూసినప్పుడు నాలుగైదుసార్లు సీట్లో నుంచి ఎగిరిపడ్డా’’ అన్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్ర చేసిన ‘చిన్నారి’ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్. సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లోహిత్ దర్శకుడు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు నేనూ ఓ హారర్ కామెడీ సినిమా చేస్తున్నా. కానీ, ఈ ట్రైలర్ భయపెట్టే విధంగా ఉంది’’ అన్నారు. ‘‘ప్రియాంక ఎక్కువ సినిమాలు చేయాలి. (నవ్వుతూ...) ‘రా’తో తనను నేను తీసుకువెళ్లానంటున్నారు. ఇప్పుడు పొమ్మంటున్నా’’ అన్నారు ఉపేంద్ర. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు నచ్చింది. తెలుగులోనూ హారర్ ప్రియులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రియాంక. -
చిన్నారి ఏం చేసింది?
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చిన్నారి’. బేబీ యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ముఖ్య పాత్రల్లో నటించారు. లోహిత్ దర్శకత్వంలో కేఆర్కే ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్‌పై కె.రవికుమార్, ఎంఎంఆర్ సంయుక్తంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘హారర్ కథాంశంతో వైవిధ్యంగా తీసిన చిత్రమిది. తల్లి, కూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. చాలా బాగుందంటూ పలువురు అభినందించారు. సూపర్ హిట్ కన్నడ మూవీ ‘రంగి తరంగి’కు సంగీతం అందించిన అజినీష్ లోక్‌నాథ్ మంచి పాటలిచ్చారు. నేపథ్య సంగీతం, కెమెరామేన్ వేణు టేకింగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి’’ అని తెలిపారు. -
పురుగుమందు తాగిన మూడేళ్ల చిన్నారి
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలింపు టేకులపల్లి : ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మూడేళ్ల చిన్నారి పురుగు మందు తాగిన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని వాగొడ్డుతండాకు చెందిన నాగేశ్, స్వరూప దంపతుల మూడేళ్ల చిన్నారి సంజన ఇంట్లో ఆడుకుంటూ ఇంటి బయట ఉన్న పురుగుమందు డబ్బా తీసుకుని అందులోని మందును ప్రమాదవశాత్తు తాగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు 108లో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చిన్నారి ప్రాణం తీసిన విక్స్ డబ్బా
-
చిన్నారి ప్రాణం తీసిన విక్స్ డబ్బా
♦ గొంతులో ఇరుక్కోవడంతో ♦ 15 నెలల పాప మృతి భైంసా: విక్స్‌డబ్బా చిన్నారి ప్రాణం తీసింది. సరదాగా ఆడుకుంటూ నోట్లో పెట్టుకోగా.. మృత్యువులా మారింది. కళ్ల ముందే కూతురు ఊపిరి ఆగుతుండడం చూసి కన్నవారు తల్లడిల్లిపోయూరు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామానికి చెందిన కారగిరి గణేశ్, వనజ దంపతుల మొదటి సంతానం సాయికృతిక్ష. వనజ తానూరు కళాశాలలో కాంట్రాక్టు అధ్యాపకురాలుగా పనిచేస్తోంది. గణేశ్ పీజీ పూర్తి చేసి గ్రూప్స్ కోసం సిద్ధమవుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంటికి చేరిన దంపతులు భోజనాలు చేశాక మంచంపై 15 నెలల చిన్నారితో ఆడుకుంటూ ఉన్నారు. అక్కడే విక్స్‌డబ్బా కనిపించగా, చిన్నారి తీసుకుని నోట్లో పెట్టుకుంది. సెకన్ల వ్యవధిలో నోట్లో ఉన్న డబ్బా గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. ఆ పక్క నే ఉన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గొంతులో ఇరుక్కుపోయిన డబ్బాను తీసేందుకు యత్నించారు. హుటాహుటిన భైంసా ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది గంటలకు భైంసాకు చేరుకునే సరికి చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ‘చేతిలో ఆడుకోవడానికి తీసుకున్న విక్స్‌డబ్బా పాప పాలిట మృత్యువుగా మారుతుం దని ఊహించలేకపోయాం, రోజూ ఇంటికి రాగానే వచ్చీరాని మాటలతో పాప ఎదురు వచ్చేది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిలుస్తారు?’ అంటూ ఆ తల్లిదండ్రులు కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది. బుధవారం ఉదయం మహాగాంలో పాప అంత్యక్రియలు నిర్వహించారు. -
‘మాట’ సాయం చేయరూ..!
దువ్వూరు, న్యూస్‌లైన్: చిరునవ్వులొలికిస్తున్న ఈ చిన్నారి పేరు యశశ్విని. చూడ్డానికి ఎంత ముద్దొస్తుందో కదూ.. కానీ.. ఇతరులు మాట్లాడింది వినలేదు. తనూ మాట్లాడలేదు. వినేందుకు కాస్త బాధగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన దువ్వూరు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ, బాలగురమ్మల పెద్ద కూతురు యశశ్విని. కూతురు పుట్టిందన్న సంతోషం ఆ పేద తల్లిదండ్రులకు ఎంతో కాలం నిల్వలేదు. పెరిగి పెద్దయ్యే కొద్దీ చిట్టిపొట్టి మాటలు మాట్లాడకపోవడంతో అనుమాన మొచ్చి.. హైదరాబాదుకు తీసుకెళ్లి పరీక్షించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాపకు మాటలు రావ ని, చెవుడు కూడా ఉందనే చేదు నిజం చెప్పారు. తిరిగి మాటలు రావాలంటే లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. కూలీనాలీ చేసుకుని పూట గడుపుకునేందుకే తమ సంపాదనే సరిపోవడం లేదు.. ఇక ఇన్ని లక్షలు ఖర్చు చేసి వైద్యం ఎలా చేయించాలంటూ ఆ పేద దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యశశ్విని 3వ తరగతి చదువుతుంది. పరుగు పందెంలో ఎప్పుడూ ప్రథమస్థానంలోనే వస్తుంది. కాని వయస్సు పెరిగేకొద్ది మాటలు రాక పోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది. మండల ఆర్వీఎం రిసోర్స్‌పర్సన్ వీరాస్వామి సలహా మేరకు కొన్నిరోజులు తిరుపతిలోని శ్రవణంలో ను చూపించారు. శస్త్ర చికిత్సతోనే మాటలు వస్తాయని వైద్యులు చెప్పడంతో పాపం మిన్నకుండి పోయారు. మనసున్న మారాజులు ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయ దలుచుకున్న దాతలు 9581851599 నెంబర్‌కు సంప్రదించాలని కోరుతున్నారు.