దువ్వూరు, న్యూస్‌లైన్:
చిరునవ్వులొలికిస్తున్న ఈ చిన్నారి పేరు యశశ్విని. చూడ్డానికి ఎంత ముద్దొస్తుందో కదూ.. కానీ.. ఇతరులు మాట్లాడింది వినలేదు. తనూ మాట్లాడలేదు. వినేందుకు కాస్త బాధగా ఉన్నా ఇది నిజం. మండల కేంద్రమైన దువ్వూరు గ్రామానికి చెందిన లక్ష్మినారాయణ, బాలగురమ్మల పెద్ద కూతురు యశశ్విని. కూతురు పుట్టిందన్న సంతోషం ఆ పేద తల్లిదండ్రులకు ఎంతో కాలం నిల్వలేదు. పెరిగి పెద్దయ్యే కొద్దీ చిట్టిపొట్టి మాటలు మాట్లాడకపోవడంతో అనుమాన మొచ్చి.. హైదరాబాదుకు తీసుకెళ్లి పరీక్షించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాపకు మాటలు రావ ని, చెవుడు కూడా ఉందనే చేదు నిజం చెప్పారు. తిరిగి మాటలు రావాలంటే లక్షల్లో ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. కూలీనాలీ చేసుకుని పూట గడుపుకునేందుకే తమ సంపాదనే సరిపోవడం లేదు.. ఇక ఇన్ని లక్షలు ఖర్చు చేసి వైద్యం ఎలా చేయించాలంటూ ఆ పేద దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యశశ్విని 3వ తరగతి చదువుతుంది. పరుగు పందెంలో ఎప్పుడూ ప్రథమస్థానంలోనే వస్తుంది. కాని వయస్సు పెరిగేకొద్ది మాటలు రాక పోవడంతో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.
మండల ఆర్వీఎం రిసోర్స్‌పర్సన్ వీరాస్వామి సలహా మేరకు కొన్నిరోజులు తిరుపతిలోని శ్రవణంలో ను చూపించారు. శస్త్ర చికిత్సతోనే మాటలు వస్తాయని వైద్యులు చెప్పడంతో పాపం మిన్నకుండి పోయారు. మనసున్న మారాజులు ఆపన్నహస్తం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయ దలుచుకున్న దాతలు 9581851599 నెంబర్‌కు సంప్రదించాలని కోరుతున్నారు.
‘మాట’ సాయం చేయరూ..!
Published Tue, Dec 31 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement