చూస్తే...భయమేస్తుంది! | chinnari movie release on 16th | Sakshi
Sakshi News home page

చూస్తే...భయమేస్తుంది!

Published Tue, Dec 13 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

చూస్తే...భయమేస్తుంది!

చూస్తే...భయమేస్తుంది!

‘‘హారర్‌ చిత్రాలంటే నేనంత భయపడను. దెయ్యాలను చూసి నవ్వుకుంటాను. ఈ చిత్రం మామూలు హారర్‌ కాదు... చాలా భయపెట్టేలా ఉంటుంది. థియేటర్‌లో సినిమా చూసినప్పుడు నాలుగైదుసార్లు సీట్‌లో నుంచి ఎగిరిపడ్డా’’ అన్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ఆయన సతీమణి ప్రియాంక కీలక పాత్ర చేసిన ‘చిన్నారి’ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్‌. సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లోహిత్‌ దర్శకుడు. హీరో శ్రీకాంత్‌ మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు నేనూ ఓ హారర్‌ కామెడీ సినిమా చేస్తున్నా. కానీ, ఈ ట్రైలర్‌ భయపెట్టే విధంగా ఉంది’’ అన్నారు.

‘‘ప్రియాంక ఎక్కువ సినిమాలు చేయాలి. (నవ్వుతూ...) ‘రా’తో తనను నేను తీసుకువెళ్లానంటున్నారు. ఇప్పుడు పొమ్మంటున్నా’’ అన్నారు ఉపేంద్ర. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా కన్నడ ప్రేక్షకులకు నచ్చింది. తెలుగులోనూ హారర్‌ ప్రియులకు నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు ప్రియాంక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement