valasa
-
ఎన్నో కథలు
మనోజ్ నందం, తేజు అనుపోజు, వినయ్ మహాదేవ్ గౌరీ, చిన్నారి ముఖ్య పాత్రల్లో వలస కార్మికుల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘వలస’. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో కళాకార్ ప్రొడక్షన్స్ సమర్పణలో యెక్కలి రవీంద్రబాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న థియేటర్లలో విడుదలవుతోంది. పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రయాణంలో ప్రేమికులైన ఒక ప్రేమజంట.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఒక కుటుంబం.. ప్రియుడితో మాట్లాడ్డానికి ఫోన్ దొరక్క తల్లడిల్లే ఓ ప్రేయసి.. నిండు నెలల గర్భంతో గూడు చేరుకోవడానికి ఆరాటపడుతున్న ఒక ఆడపడుచు... ఇలా ఎన్నో కథలు. అందరి ఆరాటం ఒక నీడకి చేరాలని, అందరి అడుగులు భవిష్యత్తు వైపు. కరోనా సమయంలో మన కళ్ల ముందు జరిగిన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి చేసిన ఒక ప్రయత్నమే ఈ చిత్రం’’ అన్నారు. ‘‘ఒక వలస కార్మికుడిగా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాను’’ అన్నారు గాజువాకకు చెందిన తులíసీ రామ్. -
ఊపిరి తీసిన ఉపాధి
– బెంగళూరులో ప్రమాదవశాత్తు కిందపడ్డ వలస కూలీ –చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి కళ్యాణదుర్గంరూరల్: ఉపాధి కోసమని కర్ణాటక ప్రాంతానికి వెళ్లిన వలస కూలి మృత్యువాత పడిన సంఘటన ఆదివారం బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన నాగన్న(50) తనకున్న 3.80 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించే వాడు. ఈ క్రమంలో కొంత కాలంగా వర్షాలు పడక పంటలు పండక పోవడంతో కుటుంబ పోషణ భారమైంది. కనీసం గ్రామంలో ఉపాధి పనులు లేక పోవడంతో బెంగళూరుకు వలస వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి రూపే నగర్ హెచ్ఎస్ఆర్ లే అవుట్ వద్ద ఉంటూ కూలి పనికి వెళ్లేవాడు. భవనంపైనుంచి కిందపడి.. మార్చి 26న అక్కడ ఇంటి నిర్మాణానికి నీరు పెడుతుండగా ప్రమాదవ శాత్తు మూడంతస్తుల మేడ పైనుంచి కిందకు పడ్డాడు. తలకు, నడుము, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కుటుంబీకులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రికు తరలించారు. ఆదివారం అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామమైన తూర్పు కోడిపల్లి ఎస్టీ కాలనీకి తీసుకొచ్చారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇక మాకు దిక్కెవరంటూ బోరున విలపించారు. అతడికి ఇద్దరు కుమారులు,ఒక కుమార్తెలు ఉన్నారు.