దేశం కోసం | Manasainodu Movie songs and trailer release | Sakshi
Sakshi News home page

దేశం కోసం

Published Sat, Aug 12 2017 12:18 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

దేశం కోసం

దేశం కోసం

మనోజ్‌ నందం, ప్రియసింగ్‌ జంటగా సత్యవరపు వెంకటేశ్వరరావు  దర్శకత్వంలో హసీబుద్దిన్‌ నిర్మించిన ‘మనసైనోడు’. సుభాష్‌ ఆనంద్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను గోపినాథ్‌ రెడ్డి, ట్రైలర్‌ను ‘సంతోషం’ ఎడిటర్‌ సురేశ్‌ కొండేటి రిలీజ్‌ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ కథలో కుటుంబ కథ జోడించాం.

యువకుల్లో దేశభక్తిని నింపేలా ఈ సినిమా ఉంటుంది. ‘జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత’ అని భారతదేశ గొప్పతనం గురించి ప్రతి భారతీయుడు పాడుకునేలా స్వర్గీయ సినారె రచించారు. మగవాళ్ల జీవితాల్లో మహిళలు లేకపోతే ఎంత నష్టమో భాస్కరభట్ల కాస్త చిలిపిగా ఒక పాట రాశారు’’ అన్నారు. ‘‘నేను వేరే దేశంలో ఉన్నా మన దేశం కోసం ఏదో చేయాలనిపించి, ఈ సినిమా తీశా’’ అన్నారు హసీబుద్దిన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement