మా నమ్మకం నిజమైంది | Dhanalakshmi Thalupu Thadithe | Sakshi
Sakshi News home page

మా నమ్మకం నిజమైంది

Published Wed, Aug 5 2015 10:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

Dhanalakshmi Thalupu Thadithe

‘‘స్టార్స్ ఎవరూ లేకపోయినా కథ మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ రోజు మా నమ్మకం నిజమై మంచి విజయం సాధించింది’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. ధన్‌రాజ్, మనోజ్ నందం, శ్రీముఖి, సింధుతులాని ముఖ్యతారలుగా భీమవరం టాకీస్ పతాకంపై  తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ చిత్రం ఇటీవలే  విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ పత్రికలవారితో మాట్లాడుతూ- ‘‘దర్శకుడు సాయి అచ్యుత్ చిన్నారి చెప్పిన కథ నచ్చడంతో నాతో కలిసి  నటుడు ధన్‌రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మా సంస్థలో ఇది 75వ సినిమా. మొత్తం 125 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశాం. పూర్తి హాస్యభరితంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని సన్నివేశాలకు థియేటర్లలో మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement