మనోజ్ నందం కథానాయకునిగా ‘సత్యవతి’
మనోజ్ నందం కథానాయకునిగా ‘సత్యవతి’
Published Sat, Aug 10 2013 12:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఓ ఫొటో జర్నలిస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్ నిమ్తితం ఓ ప్రాంతానికి వెళతాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయపెట్టే ప్రయత్నం చేస్తాడు. అలాంటి సమయంలో అతనికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక వీరిద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘సత్యవతి’. మనోజ్ నందం కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎన్.ఆర్.వీరంరెడ్డి దర్శకుడు.
వి.ఎస్.కె.రెడ్డి నిర్మాత. ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు దృశ్యానికి భారతీ సిమెంట్స్ మల్లారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, వి.సముద్ర క్లాప్ ఇచ్చారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. వాణిజ్య అంశాలు మేళవింపుతో సాగే థ్రిల్లర్ చిత్రమిదని దర్శకుడు చెప్పారు. సెప్టెంబర్ 10 నుంచి షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాత తెలిపారు.
పముఖ మీడియా సంస్థలో పనిచేసే ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా నటిస్తున్నానని, తన కెరీర్‌కి ఈ సినిమా మేలి మలుపుగా నిలుస్తుందని మనోజ్‌నందం నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా వైఎస్‌ఆర్ సీపీ నేత ఇ.వి.సుదర్శనరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎ.జయకుమార్, కెమెరా: సుధాకరరెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, సంగీతం: రాజ్‌కిరణ్, నిర్మాణం: శ్రీశివసాయికిషోర్ క్రియేషన్స్.
Advertisement
Advertisement