సున్నితమైన భావోద్వేగాలతో ‘నిన్ను చూశాక’
సున్నితమైన భావోద్వేగాలతో ‘నిన్ను చూశాక’
Published Fri, Sep 6 2013 1:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్ను చూశాక’. స్వీయ దర్శకత్వంలో రాజా దాసరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మా ణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో పాటలను, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే వినోదాత్మక ప్రేమకథ ఇది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రేమ గురించి తెలిసినవాళ్లనీ ఆకట్టుకుంటాయి.
యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సరికొత్త పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఓ ఎస్సెట్ అవుతుంది. ఇందులో ఉన్న ఐదు పాట లకు చిన్నికృష్ణ మంచి స్వరాలిచ్చారు’’ అని చెప్పారు.
Advertisement
Advertisement