Dasari Raja
-
వ్యవస్థలను మేనేజ్ చేయడమే బాబు పని
సాక్షి, గుంటూరు: వ్యవస్థలను మేనేజ్ చేయడమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పని అని ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ కేంద్రం డైరెక్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాజా మాస్టారు విమర్శించారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని తప్పులను సరిదిద్దుకోవడం వదిలి ప్రభుత్వాన్ని బలహీనపరచడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు గుంటూరులో శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 32 ఏళ్లుగా పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్టు చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైన అనంతరం చంద్రబాబు తీరులో మార్పు వస్తుందని ఎదురుచూస్తూ వచ్చానన్నారు. అయితే మార్పు రాలేదన్నారు. గడిచిన రెండు రోజుల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమం చంద్రబాబును పొగడటం, సీఎం జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమైందన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు నగరంలో ఉన్న రెండు మేజర్ గ్రంథాలయాలకు మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావుల పేర్లు పెట్టాలని ప్రతిపాదన చేస్తే చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. గ్రంథాలయానికి రామారావు పేరు పెట్టడానికి విముఖత చూపిన బాబు ఆయన ఫొటోలకు దండలు వేస్తూ, నివాళులు అర్పిస్తూ పార్టీ నాయకులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్యకాలంలో గుంటూరులోని అప్పటి రాష్ట్ర, ప్రస్తుత జిల్లా పార్టీ కార్యాలయం పక్కనే నివసిస్తున్న పేద ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని చేస్తానని తనకు మాటిచ్చి చివరి నిమిషంలో మోసం చేశాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో భవిష్యత్తు లేదని నిర్ధారణకు వచ్చిన తాను పార్టీ వీడుతున్నట్టు తెలిపారు. రాజా మాస్టారుతో పాటు గుంటూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యర్రగోపు నాగేశ్వరరావు కూడా పార్టీని వీడారు. -
చంద్రబాబుకు సాయి‘రా పంచ్‌లు..!
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయి‘రా హాష్‌టాగ్‌తో సెటైర్లు వేశారు. గతేడాది తిత్లీ తుపాన్ వచ్చినప్పుడు సహాక చర్యలు పూర్తి కాకుండానే ‘థాంక్యూ సీఎం సార్’ అని ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఫొని తుపాన్ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తాజగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, అయితే, థాంక్యూ సీఎం సార్ అనే బదులు థాంక్యూ సీఎస్ సార్ అని ప్రజలు అంటారేమోనని బాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. బాబు గంతులేస్తున్నారు.. ‘అధికారులను బెదిరించడానికి, ఓట్ల లెక్కింపు రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఈవీఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో?’ అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ జీత భత్యాలను అయాచితంగా పెంచడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచడం నీతి మాలిన చర్య కాదా చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు. గతేడాది నుంచి రాజాకు 24 లక్షలు బకాయి పడ్డామని, వాటిని చెల్లించాలని ఏప్రిల్19న ఉత్తర్వులు ఇచ్చావ్. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఉద్యోగుల జీతాలను ఇలా 200% పెంచుతారా?’ అని చురకలంటించారు. (చదవండి : దాసరి రాజాకు చంద్రబాబు నజరానా) -
సున్నితమైన భావోద్వేగాలతో ‘నిన్ను చూశాక’
మనోజ్ నందం, భవానీ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘నిన్ను చూశాక’. స్వీయ దర్శకత్వంలో రాజా దాసరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మా ణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో పాటలను, ఈ నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే వినోదాత్మక ప్రేమకథ ఇది. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రేమ గురించి తెలిసినవాళ్లనీ ఆకట్టుకుంటాయి. యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో సరికొత్త పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఓ ఎస్సెట్ అవుతుంది. ఇందులో ఉన్న ఐదు పాట లకు చిన్నికృష్ణ మంచి స్వరాలిచ్చారు’’ అని చెప్పారు.