శీనుగాడి మనసులో శిరీష
శీనుగాడి మనసులో శిరీష
Published Tue, Sep 3 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
మనోజ్ నందం కథానాయకునిగా రూపొందిన చిత్రం ‘ప్రేమప్రయాణం’. ‘శీనుగాడి మనసులో శిరీష’ అనేది ఉపశీర్షిక. నీతూ అగర్వాల్ కథానాయిక. ఎస్.ఎస్.రవికుమార్ దర్శకుడు.
కె.మస్తాన్‌వలి నిర్మాత. నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 6న విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ హైలైట్‌గా నిలుస్తుంది. ఎలేందర్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన వచ్చింది.
అనుకున్న దానికంటే సినిమా బాగా వస్తోంది’’ అని తెలిపారు. అమ్మాయి ప్రేమలో పడి కన్నతల్లికి, సొంత ఊరుకి దూరమైన ఓ బీటెక్ కుర్రాడి కథ ఇదని, చివరకు తన తల్లిని ఏలా చేరుకున్నాడనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని దర్శకుడు చెప్పారు.
Advertisement
Advertisement