మంచి వినోదంతో... | with good entertainment | Sakshi
Sakshi News home page

మంచి వినోదంతో...

Published Fri, Mar 13 2015 11:23 PM | Last Updated on Sat, Oct 20 2018 5:05 PM

మంచి వినోదంతో... - Sakshi

మంచి వినోదంతో...

‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలి. అప్పుడే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. పరిశ్రమ బాగుండాలంటే చిన్న చిత్రాలు చాలా రావాలి’’ అని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. మనోజ్ నందం, మాదాల రవి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అలౌకిక.

మణి సమర్పణలో భానుకిరణ్ చల్లా దర్శకత్వంలో డా. జేఆర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్‌కుమార్ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని నాయిని నరసింహారెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణా ప్రభుత్వానికి చిన్నా, పెద్దా తేడా లేదనీ, అన్ని సినిమాలూ ఒకటే అని చెప్పడానికే నాయిని నరసింహారెడ్డి ఈ వేడుకకు విచ్చేశారనీ, ఈ చిత్రంలో మంచి పాత్ర చేశానని మాదాల రవి అన్నారు.

మంచి కథతో రూపొందించామని దర్శకుడు అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని సంగీత దర్శకుడు తెలిపారు. హార్రర్, కామెడీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంచి కామెడీ ఉందని నిర్మాత అన్నారు. నిర్మాతలు సి. కల్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మద్దినేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement