ప్రతిభకు వేదిక ఇది | Adi Lekka Platinum Disc Function - Manoj Nandam | Sakshi
Sakshi News home page

ప్రతిభకు వేదిక ఇది

Published Tue, May 6 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM

ప్రతిభకు వేదిక ఇది

ప్రతిభకు వేదిక ఇది

 ‘‘నేను చిత్రసీమకొచ్చి పదేళ్లవుతోంది. గేయ రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాను. సంగీత దర్శకునిగా మాత్రం అనుకున్న స్థానానికి చేరుకోలేకపోయాను. నాలాగా స్ట్రగుల్ అవుతోన్న ప్రతిభావంతులకు వేదికగా ఈ సినిమా చేశాం’’ అని చిన్ని చరణ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘అదీ లెక్క’ ఈ నెల 9న విడుదల కానుంది. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి అన్విల్ ముఖ్య తారలుగా మల్లేష్ కొండేటి సమర్పణలో చిన్ని చరణ్, రమ్య ప్రవీణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. తన ప్రతిభ నిరూపించుకోవడానికి ఈ సినిమాతో చక్కటి అవకాశం దొరికిందని మనోజ్ నందం చెప్పారు. ఈ వేడుకలో సాయికార్తీక్, మహి, ప్రియాంక, వినాయకరావు, సురేష్ కొండి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement