భయపెడుతూ వినోదం | Alaukika Telugu Movie Press Meet | Sakshi
Sakshi News home page

భయపెడుతూ వినోదం

Published Tue, Oct 21 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

భయపెడుతూ వినోదం

భయపెడుతూ వినోదం

 ‘‘హారర్ కామెడీతో పాటు సందేశం ఉన్న సినిమా ఇది’’ అని దర్శకుడు భానుకిరణ్ చల్లా చెప్పారు. బ్రహ్మాజీ, మనోజ్ నందం, హరిణి, మాదాల రవి, ఉత్తేజ్ ముఖ్యతారలుగా జె. రామారావు నిర్మిస్తున్న ‘అలౌకిక’ చిత్రం పూజా కార్యక్రమాలు మంగళవారం హైదరాబాద్‌లో జరిగాయి. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి, డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు మాదాల రవి, మనోజ్‌నందం, సంగీత దర్శకుడు ప్రమోద్, కెమెరామేన్ సూర్యప్రకాశ్‌రావు మాట్లాడారు.
 
 న్యాయం ప్రకారం పోరాడుతున్నా...
 - మాదాల రవి
 లైంగిక వేధింపుల ఆరోపణలను ఇటీవల ఎదుర్కొన్న నటుడు, నిర్మాత మాదాల రవి తొలిసారిగా ఆ వ్యవహారంపై ఈ ప్రెస్‌మీట్‌లో పెదవి విప్పారు. ‘‘నాపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలే. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. న్యాయం ప్రకారం పోరాడుతున్నా. నాకు న్యాయవ్యవస్థపై నూటికి నూరుశాతం నమ్మకం ఉంది. ఆ సంఘటన జరిగిన రాత్రే నేను బెయిల్ తీసుకున్నాను. అంతే తప్ప నేను జైలుకు వెళ్లలేదు’’ అని మాదాల రవి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement