![Tollywood Actor Brahmaji Reacts On Prudhvi Comments In Laila Event](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/brahnaji.jpg.webp?itok=mRDnZ1uD)
టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన లైలా మూవీ ఈవెంట్ వివాదంపై స్పందించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ మాట్లాడిన మాటలు వందశాతం తప్పని బ్రహ్మజీ అన్నారు. ఈ విషయంలో పృథ్వీని టార్గెట్ చేయడం సరైందే అని తన అభిప్రాయం వెల్లడించారు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు.
బ్రహ్మజీ మాట్లాడుతూ..' లైలా ఈవెంట్‌లో పృథ్వీది తప్పు. సినిమా ఈవెంట్‌కు వచ్చి అలా మాట్లాడకూడదు. పృథ్వీ మీద రియాక్ట్ అయిన వాళ్లందరూ కరెక్టే. ఎలక్షన్స్ అయిపోయాయి. కొత్తగా నువ్వు ఇప్పుడు వచ్చి అలా మాట్లాడటం చాలా తప్పు. హీరో మంచి వ్యక్తి. ప్రతి చిన్న సినిమా ఫంక్షన్‌కు విశ్వక్ సేన్ వస్తాడు. పరిచయం లేకపోయినా సరే పిలిస్తే వెళ్లి సపోర్ట్ చేస్తాడు. మా బాపు సినిమా ఈవెంట్‌కు వచ్చి గంటన్నర్ర కారులోనే కూర్చున్నాడు. లైలా ప్రమోషన్‌లో ఉండి కూడా మాకు మద్దతు తెలిపేందుకు వచ్చాడు. అలాంటి వ్యక్తి సినిమాకు వచ్చి నువ్వేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు.' అని అన్నారు.
(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్.. ఈ బుద్ధి ముందుండాలి!)
ప్రస్తుతం బ్రహ్మాజీ బాపు మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో ఆమని, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే బాపు ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీర బ్యానర్లపై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment