
రామానాయుడు స్టూడియోలో భారీ చోరీ
హైదరాబాద్: హైదరాబాద్ ఫిలింనగర్లోని రామానాయుడు స్టూడియోలో ఖరీదైన సెట్టింగ్ లైట్లు చోరీకి గురయ్యాయి. స్టూడియోలో సినిమా షూటింగ్ కోసం వినియోగించే ఈ లైట్లు కొద్ది రోజులుగా కనబడటం లేదు. నిర్వాహకులు ఆరా తీయగా చోరీకి గురైనట్లు తెలిసింది. దీంతో వారు స్టూడియో మేనేజర్ శ్రీనుతో పాటు మరో పదిమందిపై అనుమానం వ్యక్తం చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీనుతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చోరీ అయిన లైట్ల విలువ భారీగా ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిర్వాహకులు తెలిపారు.