హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? | Venkatesh Second Daughter Hayavahini Marriage Details | Sakshi
Sakshi News home page

Venkatesh Daughter Marriage: రామానాయుడు స్టూడియోలో వెంకటేశ్ కూతురి పెళ్లి

Published Thu, Mar 14 2024 3:59 PM | Last Updated on Thu, Mar 14 2024 4:38 PM

Venkatesh Second Daughter Hayavahini Marriage Details - Sakshi

టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కూతురు పెళ్లికి రెడీ అయింది. గతేడాది అక్టోబరులో నిశ్చితార్థం జరగ్గా.. ఇప్పుడు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ శుభకార్యానికి వేదిక కానుంది. గతంలో ఎంగేజ్‌మెంట్ సీక్రెట్‌గా జరిగినట్లే.. ఇప్పుడు పెళ్లిని కూడా దగ్గుబాటి ఫ్యామిలీ.. అలానే ఆర్భాటాలు లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: శ్రీకాంత్‌ మేనకోడలితో గోపీచంద్‌ పెళ్లి.. ఎవరు సెట్‌ చేశారో తెలుసా?)

వెంకటేశ్-నీరజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నాడు. పెద్దమ్మాయి ఆశ్రితకు 2019లో పెళ్లి జరిగింది. జైపూర్‌లో జరిగిన ఈ వేడుకకు మెగాహీరో రామ్ చరణ్‌ దంపతులు హాజరయ్యారు. వెంకటేశ్ రెండో అమ్మాయి పేరు హయవాహినికి.. గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. చాలా సింపుల్‌గా జరిగిన ఈ వేడుకకు మహేశ్, చిరంజీవి హాజరయ్యారు.

ఇప్పుడు వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మార్చి 15న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో.. ఈ వివాహానికి వేదిక కానుంది. అయితే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి ఫొటోలు వచ్చే దానిబట్టి.. మనకు ఈ విషయమై క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement