
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: ఏడుకొండల వాడి దివ్య దర్శనానికి సోమవారం పలువురు ప్రముఖులు తరలివచ్చారు. వైఎస్సీర్సీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు, టీడీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామాహేశ్వర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వారు స్వామిని దర్శించుకున్నారు. ఒకరికి ఒకరు సినిమా ఫేం హీరో శ్రీరామ్ దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.